ప్రజాస్వామ్యమా.? ‘పచ్చ’స్వామ్యమా.?

అసెంబ్లీ సమావేశాల్ని ప్రతిపక్షం బహిష్కరిస్తే, ప్రతిపక్షానికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేనట్లేనట. ఇది అధికార తెలుగుదేశం పార్టీ నేతల ‘పచ్చ’ నీతి. తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేయడం తెలియదు.. అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించడమూ తెలియదు. నవ్విపోదురుగాక మనకేటి.. అన్న చందాన అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తోంటే, జనం ఆ పార్టీని చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు మరి.!

అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ మర్చిపోయి చాలాకాలమే అయ్యింది. స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో, పార్టీ ఫిరాయింపులకు ఒకప్పుడు తావు లేదు. ‘పార్టీలోకి రావాలనుకుంటే, పదవులకు రాజీనామా చెయ్యాల్సిందే..’ అని నిబంధన పెట్టారు అప్పట్లో స్వర్గీయ ఎన్టీఆర్‌. ఇప్పుడు పరిస్థితి అది కాదు. ‘రండి బాబూ రండి..’ అంటూ సంతలో పశువుల్లా ప్రజా ప్రతినిథుల్ని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కొనుగోలు చేస్తోంది.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తే, దాన్ని రాజకీయ వ్యభిచారమన్న చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌లో అదే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి, ఆ రాజకీయ వ్యభిచారంలో తమ పార్టీ తక్కువేమీ తిన్లేదని నిరూపించేశారు. సంతలో పశువులు, రాజకీయ వ్యభిచారం.. ఇలాంటి మాటల్ని పార్టీ ఫిరాయింపులపై ప్రయోగించింది చంద్రబాబే.!

ఆ లెక్కన, పార్టీ ఫిరాయించిన వారంతా అసెంబ్లీలో పచ్చ కండువాలు కప్పుకుని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కన్పిస్తోంటే.. వారిని చూడ్డానికి అసెంబ్లీకి ప్రతిపక్షం వెళ్ళాలట. అలా వెళ్ళడమే ప్రజాస్వామ్యట. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు, కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు.. వైఎస్సార్సీపీ తీరుపై గుస్సా అయిపోతున్నారు. వైఎస్సార్సీపీ మీద విమర్శలు చేస్తే ఏమొస్తుంది.? పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న అధినేతకి ప్రజాస్వామ్యం గురించీ, నైతిక విలువల గురించీ క్లాసులు పీకే ధైర్యముండాలి. ఇంకా నయ్యం, అంత సీన్‌ ఆ నేతలకెక్కడిది.? అందుకే, జగన్‌ మీద నోరు పారేసుకుంటున్నారు.

జగన్‌ చేసింది తప్పే అయితే, 2019 ఎన్నికల్లో ప్రజలే తీర్పు ఇస్తారు. కాదూ, జగన్‌ చేసింది రైటే అయితే ఆ విషయమూ 2019 ఎన్నికల్లోనే తేటతెల్లమవుతుంది. ఈలోగా అధికార పార్టీ ప్రజాస్వామ్యమనీ, నైతిక విలువలనీ తమకు లేని విలువల గురించి అత్యుత్సాహం ప్రదర్శించడం ఎందుకట.!


Recent Random Post: