ప్రమాణ స్వీకారం చేసిన ‘భరత్’

మహేష్ బాబు, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భరత్ అనే నేను సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రమోషన్ మొదలైంది. ఫస్ట్ ఓథ్ పేరిట ఏం రిలీజ్ చేస్తారనే అనుమానాలను ముందు రోజే దర్శకుడు తీర్చేశాడు. భరత్ అనే నేను సినిమాకు సంబంధించి ఓ ఆడియోను విడుదల చేస్తామని ప్రకటించాడు.

చెప్పినట్టుగానే సినిమాలో మహేష్ బాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆడియో క్లిప్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడనే వార్త, తాజాగా విడుదల చేసిన ఆడియో క్లిప్ తో నిజమైంది.ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. భరత్ అనే నేను టైటిల్ లోగోతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తున్న మహేష్ స్టిల్ ను ఫస్ట్ లుక్ కింద విడుదల చేశారు. అసెంబ్లీ వద్ద ఉండే గాంధీ బొమ్మను టైటిల్ డిజైన్ లో వాడుకున్నారు.

ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా సినిమా స్టోరీపై కూడా చిన్నపాటి క్లారిటీ ఇచ్చేశాడు కొరటాల. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయాలకు కాస్త ఫిక్షన్ జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపాడు. దీంతో ఓ హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టి భరత్ అనే నేను సినిమాను తీస్తున్నారనే పుకార్లకు చెక్ పడింది.

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కైరా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఏప్రిల్ 27న భరత్ అనే నేను సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని మేకర్స్ గతంలో ప్రకటించారు. త్వరలోనే ఈ విడుదల తేదీపై మరోసారి స్పష్టత రానుంది.


Recent Random Post: