
పైసా వసూల్ సినిమా నుంచి బాలయ్యకు ఓ కొత్త మేనరిజమ్ పుట్టుకొచ్చింది. ఎక్కడికి వెళ్లినా ఆ మేనరిజమ్ మాత్రం వదలడం లేదు. అప్పట్లో ఆ చేతి సైగపై విమర్శలు, వివాదాలు కూడా రేగాయి. కానీ “బాలయ్య అంతే.. బాలయ్య అంతే” అని అంతా సరిపెట్టుకున్నారు. తాజాగా గరుడవేగ ఫంక్షన్ లో కూడా అదే టైపు మేనరిజమ్స్ చూపించాడు బాలయ్య. కాకపోతే మధ్యలో శ్రద్ధాదాస్ ఉండడంతో.. ఈసారి దీనిపై చర్చ మరింత ఎక్కువైంది.
గరుడవేగ ట్రయిలర్ లాంచ్ లో బాలయ్య, రాజశేఖర్ మాట్లాడుకున్నారు. మధ్యలో శ్రద్ధా దాస్ కూర్చుంది. ఏదో మాట్లాడుతూ సడెన్ గా బాలయ్య తన మార్క్ మేనరిజమ్ చూపించాడు. అంతే ఒక్కసారి శ్రద్ధా దాస్ షాక్ అయింది. దీనిపై ఎట్టకేలకు స్పందించింది ఈ బ్యూటీ.
“ఆడియో ఫంక్షన్ లో రాజశేఖర్ తో బాలయ్య ఏవో సైగలు చేశారు. చేత్తో ఏదో చేసి చూపించారు. తెలుగులో ఏవో జోకులు వేశారు. మధ్యలో నేనున్నాను కానీ నాకు అర్థం కాలేదు.” అంటోంది శ్రద్ధాదాస్.
అయితే బాలయ్య మాత్రం చాలా స్వీట్ పర్సన్ అంటోంది ఈ బ్యూటీ. గుంటూరు టాకీస్ ఫంక్షన్ కు తను పిలిస్తేనే వచ్చారని తెలిపింది. తన ఫంక్షన్ కు బాలయ్య వస్తే సినిమా హిట్ అంటోంది శ్రద్ధాదాస్.
Recent Random Post:

















