
మిషన్ భగీరథ… తెలంగాణ ప్రభుత్వం మహిళలను నీటి కష్టాల నుంచి బయటపడేసేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని చేపట్టింది. ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తాగునీటి కోసం గ్రామీణులు ముఖ్యంగా మహిళలు కష్టపడుతూ ఉపాధి అవకాశాలు కోల్పోతుండడమే కాకుండా ఆరక్షిత నీటితో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో సులభంగా తెలంగాణలోని ప్రతీ ఇంటికి రక్షిత తాగునీరు అందించే విధంగా వాటర్‌గ్రిడ్ (మిషన్ భగీరథ) పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం దాదాపు రెండేళ్ళ క్రితం చేపట్టింది. ప్రస్తుతం ఉన్న 31జిల్లాల్లో (గతంలోని తొమ్మిది గ్రామీణ జిల్లాల్లో) రక్షిత తాగునీరు అందించే ఉద్దేశ్యంతో చేపట్టిన మిషన్ భగీరథ పనులు యుద్ధప్రతిపాదికన సాగుతున్నాయి.
వివిధ ప్యాకేజీల క్రింద జిల్లాల్లో మొత్తం దాదాపు 50వేల కిలోమీటర్ల పైపులైన్లతో తాగునీరు అందించాలనేది లక్ష్యంకాగా అందులో దాదాపు 50శాతం పైప్‌లైన్ పనులను ‘మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్’ (ఎంఈఐఎల్) చేపట్టింది. మొత్తం పైప్లైన్లలో దాదాపు 25వేల కిలోమీటర్ల మేర ‘మేఘా ఇంజనీరింగ్ గ్రామీణ ప్రాంతాల్లో వేస్తుండగా ఇప్పటికి 20వేల కిలోమీటర్లుకు మించి పైప్లైన్ల నిర్మాణం (వేయటం-లేయింగ్) శరవేగంగా పూర్తిచేసింది. భూమి వ్యాసం కన్నా ఇది ఎక్కువ.
భూ గ్రహ వ్యాసం 12,742కిలోమీటర్లు కాగా మొత్తం మీద 50వేల కిలోమీటర్ల పైపులైన్లు మిషన్ భగీరథలో వేస్తుండగా అందులో ‘ఏంఈఐఎల్’ వేస్తున్న పైపులైన్ల పొడవు దాదాపు 2 సార్లు భూ గ్రహాన్ని చుట్టివచ్చేంత పొడవు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి అమెరికాకు విమానంలో ప్రయాణించాలంటే 13వేల కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఏంఈఐఎల్’ వేస్తున్న పైపులైన్ల పొడవు దాదాపు మూడింతలు ఉన్నాయంటే ఏంత సుదీర్ఘమైన పైపులైన్లను ఏంఈఐఎల్ తాగునీటి అవసరాలకోసం వేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో వివిధ ప్యాకేజీల క్రింద సమగ్ర తాగునీటి పథకాలను ‘మేఘా ఇంజనీరింగ్’ మిషన్ భగీరథ క్రింద నిర్మిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేయాలనేది లక్ష్యం కాగా ప్రధానమైన పనులు ఎప్పుడో పూర్తయిపోయాయి. ఇప్పటికే అత్యధిక ప్రాంతాల్లో నీటి సరఫరా ప్రారంభమైంది.
గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తాగు నీటి సరఫరా ఇప్పటికే పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది. ఇంట్రా పైపులైన్ల నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. గజ్వేల్‌లో 2016ఆగష్టు 7వ తేదిన ప్రధాని నరేంద్ర మోడి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిని నిర్ణీత గడువుకంటే ముందే పూర్తి చేసి ఏంఈఐఎల్ రికార్డు సాధించింది. ఈ నియోజకవర్గంలో 67వేల మంది ప్రజలకు తాగునీరు అందించే విధంగా 1200 కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు వేయటం పూర్తిచేసింది.
అంటే హైదరాబాద్ నుంచి అమెరికా అంత దూరం పైపులైన్లను ఏంఈఐఎల్ ఏడాదికి ముందే పూర్తిచేసిందంటే ఆ సంస్థ శక్తి సామర్థ్యాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే 10ఏళ్ళ పాటు నిర్వహణ కూడా ఈ సంస్థనే చేపట్టింది. ఈ పథకం గజ్వేల్ ప్రాంతంలో వాడుకలోకి వచ్చి ఇప్పటికే ఏడాది కాలం పూర్తయింది. పథకం అమలు తీరు అత్యంత సమర్థంగా ఉందనటానికి అక్కడి ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో పాటు ఇప్పటి వరకు ఎటువంటి సాంకేతిక పరమైన సమస్యలు ఎదురు కాకపోవడం విజయానికి అద్దం పడుతోంది.
గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తాగునీటి పథకాలను సమర్థంగా నిర్మించి విజయవంతంగా అమలు చేయటంలో ఎంఈఐఎల్కు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉంది. దేశం మొత్తం మీద తాగునీటి పథకాలు ఇపిసి పద్ధతిలో నిర్మించడంలో అగ్రభాగంలో ఉంది. వాటర్‌గ్రిడ్‌ను గత అయిదారేళ్ళక్రితమే గుజరాత్లో నిర్మించి అక్కడ విజయవంతం చేసిన ఘనత ఈ సంస్థది.
తెలంగాణ ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి శ్రీ. కె.చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిషన్ భగీరథను చేపట్టారు. అంతర్జాతీయ పోటీ పద్ధతిలో నిర్వహించిన టెండర్లలో పలు ప్యాకేజీలను ఏంఈఐఎల్ దక్కించుకుంది. ఈ సంస్థతోపాటు మరికొన్ని ఇంజనీరింగ్ సంస్థలు కూడా పనులు చేస్తున్నప్పటికీ ఈ సంస్థ మాత్రమే లక్ష్యం మేరకు పనులను చురుగ్గా చేసుకుపోతోంది.
పైప్లైన్లను సొంతంగా నిర్మించుకునే ఖర్మాగారాలు కూడా ఈ సంస్థకు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఎంఎస్, డిఐ, హెచ్‌డిపిఈ, బిడబ్ల్యూఎస్సిపి, పిసిసిపి రకాల పైపులను మిషన్ భగీరథ పనుల్లో ఉపయోగిస్తున్నారు. ఇందులో ఎంఎస్, డిఐ పైపులు పెద్ద సైజులో ఉంటాయి. వీటిని ప్రధాన వనరుల నుంచి గ్రామానికి నీటి సరఫరా చేసే మార్గంలో వేస్తుంటారు. తెలంగాణ మొత్తం మీద ఎంఎస్ పైపులైన్లు 1411కిలోమీటర్ల మేర వేస్తుండగా అందులో ఏంఈఐఎల్ 930కిలోమీటర్ల మేర చేపట్టి ఈప్పటికీ దాదాపు 800కిలోమీటర్ల మేర పూర్తిచేసింది.
అదే విధంగా డిఐ పైపులు రాష్ట్రం మొత్తం మీద 15316కిలోమీటర్ల మేర వేస్తుండగా ఏంఈఐఎల్ సంస్థ 6151కిలోమీటర్ల మేర చేపట్టి ఇప్పటికి 5వేల కిలోమీటర్లకు పైగా పూర్తిచేసింది. ఇదే విధంగా ఇతర పైపులైన్లను వేయటంలో కూడా ముందుస్తులో ఉంది. రాష్ట్రం మొత్తం మీద 459మండలాల్లోని 20558గ్రామాల్లోని 43లక్షల ఇళ్ళకు రక్షిత తాగునీరు అందించాలనేది లక్ష్యం.
ప్రధానంగా పాలేరు, మంథని-భూపాలపల్లి, నల్గొండ జిల్లా ఏకెబిఆర్, మహబూబ్‌నగర్ జిల్లా ఎల్లూరు, అదిలాబాద్ జిల్లా ఎస్ఆర్ఎస్పి, కరీంనగర్జిల్లా కోరుట్ల- జగిత్యాల- ధర్మపురి, పెద్దపల్లి- రామగుండం, నిజామాబాద్ జిల్లా సింగూర్ – జుక్కల్ తదితర ప్యాకేజీలను ఈ సంస్థ చేపట్టింది. ఈ పథకాల్లో నీటి వనరు (ఇన్‌టేక్ వెల్) నుంచి పైపులైన్ల ద్వారా నీటిని ఓవర్‌హెడ్ ట్యాంకు లేదా రిజర్వాయర్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి వివిధ గ్రామాలకు ట్యాంకులు, పైప్లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. ఇందులో భాగంగా నీటి శుద్ధి (వాటర్ట్రిట్మెంట్ ప్లాంట్) ప్లాంట్లు, రిజర్వాయర్లు, ట్యాంకులు, ఇంటింటికీ కుళాయిలకు అవసరమైన ఇంట్రాపైప్లైన్ల నిర్మాణం పూర్తయ్యేవిధంగా అన్ని ప్యాకేజీల్లోనూ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
Recent Random Post: