
ఓ సినిమా రెండు భాగాలుగా రావడం అనేది ఓ ట్రెండ్. రక్తచరిత్ర, బాహుబలి లాంటి ప్రాజెక్టులు ఇలా రెండేసి భాగాలుగా వచ్చాయి. త్వరలోనే ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఇలా రెండు సినిమాలుగా రాబోతోందనేది టాక్. చెప్పాల్సిన విషయం చాలా ఉన్నప్పుడు ఇలా ఒక కథను రెండు ముక్కలు చేయడం సహజం. సరిగ్గా భరత్ అనే నేను విషయంలో కూడా ఇలానే జరగాల్సింది. కానీ ఆ ఛాన్స్ మిస్ అయిపోయిందంటున్నాడు మహేష్.
“కొరటాల శివ నన్ను కలిశాడు. ఏకథాటిగా 5గంటల పాటు స్టోరీ నెరేట్ చేశాడు. చెబితే మీరు(యాంకర్) నమ్మరు కానీ 5గంటల నెరేషన్ అద్భుతం. ఏ ఒక్క సీన్ ను తీసేయడానికి వీల్లేకుండా చెప్పాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తే బాగుంటుందని అప్పుడే అనుకున్నాను.”సెట్స్ పైకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 4గంటల సినిమాను తీశామంటున్నాడు మహేష్.. ఫైనల్ గా అందులోంచి గంట నిడివిని తగ్గించి, 3గంటల సినిమాగా ప్రేక్షకుల ముందుకొస్తున్నామని తెలిపాడు. అంటే.. 5గంటల సినిమాను 4గంటలకు తగ్గించి, ఆ తర్వాత ఎడిటింగ్ టేబుల్ పై మరో గంట కుదించారన్నమాట.
భరత్ అనే నేను సినిమా నిడివి పెరగడానికి ఇది కూడా ఓ కారణం అంటాడు మహేష్. సినిమాలో ఎమోషనల్ పార్ట్ ఎక్కువగా ఉంటుందని, ఏమాత్రం తగ్గించినా ఫీల్ మిస్ అయిపోతుందని, అందుకే దాదాపు 3గంటల నిడివితో సినిమాను విడుదల చేస్తున్నామని తెలిపాడు.ఎడిటింగ్ దశలో కట్ చేసిన సన్నివేశాల్లో తనకు నచ్చిన సీన్లు చాలానే ఉన్నాయంటున్నాడు మహేష్. బాహుశా సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత డిలీటెడ్ సీన్స్ పేరిట వాటిని దశలవారీగా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారేమో.
Recent Random Post: