మధురవాణిగా సమంత

మహానటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో నటించిన సమంత ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేసారు. మహానటి సినిమాలో సమంత జర్నలిస్ట్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఆ పాత్ర పేరు మధురవాణి. ఈ పేరు తెలుగు సాహితీ రంగంలో సుపరిచితం. గురజాడ కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర కీలకం. మధురవాణిగా కన్యాశుల్కంలో సావిత్రి నటన అజరామరం.

అందుకే మహానటి సినిమాలో సమంత పాత్రకు మధురవాణి అని పేరు పెట్టారు. కళ్లజోడుతో ఫుల్ హ్యాండ్స్ షర్ట్ తో సమంత కొత్తగా, డిఫరెంట్ గా కనిపిస్తోంది. సినిమాలో ఈ పాత్ర ద్వారానే మహానటి కథ చెప్పిస్తాడు దర్శకుడు అని వినికిడి.