మరో ఛాలెంజింగ్‌ రోల్‌లో తాప్సీ

సౌత్‌లో ఎక్కువగా గ్లామరస్‌ రోల్స్‌ చేసిన తాప్సీకి, బాలీవుడ్‌లో గ్లామరస్‌ రోల్స్‌తోపాటు ఛాలెంజింగ్‌ పాత్రలూ దక్కుతున్నాయి. అన్నట్టు, ఇదే విషయమై తాప్సీ సౌత్‌ సినిమాలపై నోరు పారేసుకోవడం, ఆ తర్వాత ‘క్షమాపణ’ చెప్పడం తెల్సిన విషయాలే.

ఇక, అసలు విషయానికొస్తే, తాప్సీ బాలీవుడ్‌లో మరో సూపర్‌ ఆఫర్‌ తన ఖతాలో వేసుకుంది. భారత హాకీ మాజీ ఆటగాడు, అర్జున్ అవార్డ్ గ్రహీత సందీప్‌ సింగ్‌ బయోపిక్‌లో తాప్సీ నటిస్తోంది. సందీప్‌ సింగ్‌ పాత్రలో దిల్జిత్‌ దోసాంజ్‌ నటిస్తున్నాడు. భారత హాకీ చరిత్రలో సందీప్‌ సింగ్‌కి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సందీప్‌ సింగ్‌, ఇక కోలుకునే అవకాశం లేదని డాక్టర్లు తేల్చేసినా, అనూహ్యంగా కోలుకుని, తిరిగి హాకీ మైదానంలో ఆటగాడిగా అడుగుపెట్టి సత్తా చాటాడు.

‘ఇదొక ఇన్‌స్పైరింగ్‌ స్టోరీ.. ఈ సినిమాలో నా పాత్ర చాలా బలంగా వుంటుంది. మానసికంగా ఎంతో ధృఢమైన యువతి పాత్రలో కన్పించబోతున్నాను. క్లిష్ట సమయంలో సందీప్‌కి అండగా నిలిచిన పాత్ర అది. తెరప భావోద్వేగాలు అత్యద్భుతంగా కన్పించబోతున్నాయి. నాకిదొక ఛాలెంజింగ్‌ రోల్‌..’ అని తాప్సీ చెప్పుకొచ్చింది.

తాప్సీ నటించిన బాలీవుడ్‌ సినిమా ‘ముల్క్‌’ ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. మొన్నీమధ్యనే వచ్చిన ‘జుద్వా-2’ సినిమాలో అల్ట్రా మోడ్రన్‌ లుక్‌లో కన్పించిన తాప్సీ, ఇప్పుడు మళ్ళీ గ్లామర్‌ని కాస్త పక్కన పెట్టి, పెర్ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌పై ఫోకస్‌ పెట్టింది.


Recent Random Post: