మహేష్‌బాబు చిత్రం రిలీజ్ డేట్ తో వివాదం!

మహేష్ బాబు – కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న తాజా చిత్రాన్ని సంక్రాంతి బరినుంచి కాస్త వెనక్కు తీసుకువెల్లి.. ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదల తేదీ ఇండస్ట్రీలో ఒక వివాదానికి బీజం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా సినీ పరిశ్రమలో ఉన్న ఒక సుహృద్భావ వాతావరణాన్ని ఇది దెబ్బతీసేలా ఉన్నదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒకే రోజున రెండు సినిమాలు విడుదల అవకుండా.. ఒకసినిమా వల్ల మరో సినిమా నష్టపోకుండా పరిశ్రమలో ఇప్పటికే ఒక అప్రకటిత ఒప్పందం చెలామణీలో ఉంది. ముందుగా ఎవరు రిలీజ్ డేట్ ప్రకటించేస్తే.. మిగిలిన సినిమాల వాళ్లు దానికి అనుగుణంగా తమ సినిమాల విడుదల తేదీలను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే .. ముందుగా తాము తమ సినిమా తేదీని ప్రకటించినా కూడా కనీసం తమను సంప్రదించకుండా.. ఆ తర్వాత మహేష్ సినిమాను అదే తేదీన వేస్తున్నట్లు అనౌన్స్ మెంట్ రావడం బాధ కలిగించిందని నిర్మాత బన్నీ వాసు అంటున్నారు. ఆయన సహనిర్మాతగా అల్లు అర్జున్ హీరోగా లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న చిత్రం విడుదలను ఇదివరకే ఏప్రిల్ 27న అని ప్రకటించిన నేపథ్యంలో ఈ వివాదం రేగింది.

బన్నీవాసు మరో ముగ్గురు కలిసి వీ4 పతాకంపై ‘నెక్ట్స్ నువ్వే’ చిత్రం తీస్తున్నారు. అల్లు అరవింద్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న బ్యానర్ గా వీ4 బ్యానర్ కు ప్రధాన గుర్తింపు ఉంది. ప్రభాకర్ దర్శకత్వంలో తీస్తున్న ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత బన్నీ వాసు శనివారం మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఎంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ.. తాము ముందుగా ప్రకటించిన తేదీకే.. కనీసం మాటమాత్రంగానైనా చెప్పకుండా నిర్మాత దానయ్య కూడా మహేష్ బాబు చిత్రం విడుదల తేదీ ప్రకటించడం బాధ కలిగించిందని అన్నారు.

నిజానికి వాళ్లు సమ్మర్ సినిమాగా తమ చిత్రాన్ని ప్రకటించలేదని, వాళ్లు అనౌన్స్ చేసిన తేదీల ప్రకారం అవి పొంగల్ సినిమాలు మాత్రమేనని, ఇప్పుడు సమ్మర్ కు మార్చారని.. అప్పటికీ తాము సమ్మర్ లో కూడా చిన్న సినిమాలు ఉంటాయనే ఉద్దేశంతో ఓ నెల వదిలేసి ఏప్రిల్ చివర్లో విడుదల ప్లాన్ చేసుకున్నాం అన్నారు. ఖుషీ డేట్ అనే ఆశతో ఆ తేదీ పెట్టుకున్నాం అన్నారు. మహేష్ బాబు సినిమా పొంగల్ కు వస్తుందని, రాంచరణ్ సినిమా సమ్మర్ ప్రారంభంలో వస్తుందనే ఉద్దేశంతో , అల్లు ర్జున్ సినిమాకు ఆ తేదీ నిర్ణయించాం అన్నారు.

ఇప్పుడు దానయ్య గారు చెప్పినా తేదీ మార్చుకోకపోవచ్చునని.. భయపడి వెళ్లినట్లుగా ఉంటుందని, ఫైనల్ గా పెద్దలు ఎలా డిసైడ్ చేస్తే అలా జరుగుతందని అన్నారు. అయితే ఇండస్ట్రీలో హెల్తీ వాతావరణం ఉందని, గతంలో ‘ఈగ, జులాయి’ ఒకేసారి షెడ్యూల్ అయితే.. తానే స్వయంగా రాజమౌళి వద్దకెళ్లి.. జులాయి వారం తరవాత వేద్దాం అనుకున్నాం అని.. కానీ ఈగ పెద్ద హిట్ అయ్యాక.. దానిక స్పేస్ ఉండాలనే ఉద్దేశంతో ఏకంగా మూడు వారాలు వెనక్కు వెళ్లాం అని చెప్పుకొచ్చారు.

ఇలా ఒకే తేదీకి విడుదలలు ప్రకటించడం వల్ల.. ఈ హెల్తీ వాతావరణం దెబ్బతింటుందని బన్నీ వాసు చెప్పారు. మొత్తానికి మహేష్ బాబు చిత్రం విడుదల తేదీ.. పరిశ్రమ హెల్తీ వాతావరణాన్ని చెడగొడుతోందనే వివాదం ఇప్పుడు ప్రచారం అయ్యేలా ఉంది.


Recent Random Post: