
రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన మూవీ రంగస్థలం. ఇప్పుడీ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధమైపోయింది. ఫస్ట్ కాపీ తాను చూసేశానంటూ మెగాస్టార్ చిరంజీవి స్వయంగా చెప్పేశారు. అయితే సుకుమార్ తో ఈ సినిమా గురించి బాగా పొగిడారంట. ఆ సమయంలో ఎవరైనా ఉండుంటే.. మెగాస్టార్ పొగడ్తలను ఇంకా బాగా చెప్పేవారని.. కాని తాను అది రిప్రొడ్యూస్ చేయలేకపోతున్నాను అని చెప్పాడు సుకుమార్. అయితే ఆ పొగడ్తల్లో అనసూయ పేరు కూడా ఉంది. కాని అక్కడే ఒక విషయం చెప్పాలి.
రీసెంట్ గా రంగస్థలం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ మాస్ ప్లస్ సుకుమార్ క్లాస్ టచ్ అన్నీ కలిసి ట్రైలర్ అదిరిపోయింది. కానీ ఈ ట్రైలర్ మొత్తం మీద ఎక్కడా.. ఓ కీలక పాత్రను అస్సలు చూపించలేదు. రంగమ్మత్త పాత్రలో నటిస్తున్న అనసూయను అసలు ట్రైలర్ లో చూపకపోవడంతో.. ఆమె ఫ్యాన్స్ తెగ ఫీలయిపోతున్నారు. రామ్ చరణ్ లాంటి పాత్రతో అత్త అని పిలిపించుకునే రోల్ కు అసలేమాత్రం ఒప్పుకోకపోయినా.. కేవలం ఆ క్యారెక్టర్ మిస్ చేసుకోకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ పాత్రను చేసినట్లు అనసూయ చెప్పింది. అలాంటి కీలక పాత్రను ట్రైలర్ లో కనీసం ఒక ఫ్రేమ్ లో అయినా చూపించకపోవడం నిరాశ కలిగించే విషయం.
కానీ అసలు అనసూయను ఎందుకు తీసుకున్నారా అనుకున్నానని.. సినిమా చూశాక అందుకా అనసూయ అని అర్ధమైందని అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చెప్పినపుడు.. అనసూయ ఆనందం అదరహో అనాల్సిందే. కానీ ఇదే ఈవెంట్ లో అటు హీరో రామ్ చరణ్ కానీ.. అటు హీరోయిన్ సమంత కానీ.. అనసూయ గురించి ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
Recent Random Post:

















