
అసలు ఇద్దరి మధ్యా ప్రేమ ఎప్పుడు చిగురించిందో ఎవరికీ తెలియదు. నమిత, వీరూ ఓ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో చాలాకాలంగా కొనసాగడం, ఆ గ్రూప్‌లో ఇతర స్నేహితులెవరూ ‘లవ్’ వంటి ఆలోచనలు చేయకపోవడం.. ఆశ్చర్యకరమే. ‘నేను వీరూని పెళ్ళాడబోతున్నానోచ్..’ అని నమిత ప్రకటించేదాకా ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్‌కీ ఆ విషయం తెలియదట.
ఎలాగైతేనేం, ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించేసింది నమిత. అంతేనా, పెళ్ళి డేట్‌ని కూడా అనౌన్స్ చేసేసింది. అన్నీ చకచకా జరిగిపోయాయ్. ఇద్దరూ పెళ్ళిపీటలెక్కేశారు.. మూడుముళ్ళ బంధంతో ఒక్కటైపోయారు. ప్రేమ, పెళ్ళి.. ఇటీవలి కాలంలో ఈ రెండూ ఇంత వేగంగా జరిగిపోవడం విశేషంకాక మరేమిటి.?
సీనియర్ నటుడు శరత్‌బాబుతో ఎఫైర్.. అంటూ వచ్చిన గాసిప్స్ తర్వాతే నమిత, పెళ్ళి చేసేసుకోవాలని డిసైడ్ అయ్యిందా.? ఏమోగానీ, ఆ గాసిప్స్‌ని ఖండించేసిన కొద్ది రోజుల్లోనే నమిత తన ప్రేమ వ్యవహారంపై స్పష్టతనిచ్చింది. నమిత పెళ్ళట.. అని అంతా చర్చించుకుంటుండగానే, ఇద్దరి పెళ్ళితంతు కూడా పూర్తయిపోయింది.
తెలుగులో ‘సొంతం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నమిత, వెంకటేష్‌తో ‘జెమిని’, బాలకృష్ణతో ‘సింహా’ తదితర సినిమాల్లో నటించిన విషయం విదితమే. తెలుగులో హీరోయిన్‌గా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయినా, తమిళంలో మాత్రం అవకాశాలు బాగానే అందిపుచ్చుకుని, కొన్ని సక్సెస్‌లు కూడా కొట్టింది. నమిత భర్త వీరేంద్ర చౌదరి, తమిళ, మలయాళ సినిమాల్లో నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్నాడు.
నమిత – వీరూ పెళ్ళికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్దగా ప్రముఖులెవరూ హాజరు కాకపోవడం గమనార్హం. తమిళ సినీ పరిశ్రమ నుంచీ అత్యంత సన్నిహితులైనవారే తిరుపతిలో జరిగిన ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.
Recent Random Post: