మే 20న ఎన్టీఆర్ ఏమివ్వబోతున్నాడు?

Actress Trisha Krishnan Wet Hot Ultra HD Photos in Pink Saree from Kalavathi Movie

స్టార్ హీరోల పుట్టిన రోజు వస్తోందంటే అభిమానులకు ఏదో ఒక కానుక ఇవ్వాల్సిందే. అప్పటికే ఏదైనా కొత్త సినిమాలో నటిస్తుంటే ఫస్ట్ లుక్కో.. ఫస్ట్ టీజరో.. ఇంకోటో లాంచ్ చేయాల్సిందే. ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే.

గత నెలలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలుపెట్టిన నేపథ్యంలో ఆ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విశేషాన్ని అభిమానులతో పంచుకునే అవకాశముందని కొన్ని రోజుల కిందట్నుంచే ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ లుక్ అని కొందరు.. టైటిల్ ప్రకటిస్తారని ఇంకొందరు.. ఇంకేదో విశేషం ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఈ ఊహాగానాలకు తగ్గట్లే ఎన్టీఆర్ పీఆర్వో ఒక ట్వీట్ చేశాడు.

ఎన్టీఆర్ పుట్టిన రోజు కోసం ప్రత్యేకమైన కానుక రెడీ అవుతోందన్నాడు. దానికి సంబంధించిన పని నడుస్తోందని.. ఈ కానుక అభిమానుల్ని ఎంతమాత్రం నిరాశ పరచదని.. వాళ్ల నిరీక్షణకు తగ్గట్లే ఉంటుందని చెప్పాడు. ఈ ట్వీట్ చూశాక ఎన్టీఆర్ అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ కుదరడంతో వీళ్ల కలయికలో వచ్చే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. కొత్త షెడ్యూల్లో హీరోయిన్ పూజా హెగ్డే కూడా పాల్గొంటోంది. పవన్ మిత్రుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘అసామాన్యుడు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నాడు.


Recent Random Post: