
ఇంటిలిజెంట్ సినిమాకు సంబంధించి రాజమండ్రిలో వేడుక నిర్వహించినప్పుడు అంతా వినాయక్ వైపు చూశారు. పొలిటికల్ ఎంట్రీ కోసమే బహిరంగ సభను తలపించేలా భారీ ఈవెంట్ ప్లాన్ చేశారని పుకార్లు వచ్చాయి. దీనికి ఊతమిస్తూ కొన్ని కుల సంఘాలు, మెగాభిమానులు ఏకమవ్వడంతో ఈసారి వినాయక్ పొలిటికల్ ఎంట్రీ గ్యారెంటీ అనుకున్నారంతా. కానీ ఈ మెగా డైరక్టర్ మాత్రం ప్రస్తుతానికి అలాంటి అలోచన లేదంటున్నాడు.
“అంతా ఉత్తిదే. నేను పాలిటిక్స్ లోకి రావడం లేదు. ప్రస్తుతం నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. మా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండడం వల్ల ఇలాంటి పుకార్లు వస్తున్నాయి.” తన రాజకీయ ఎంట్రీపై వినాయక్ కామెంట్ ఇది.”ఓ ప్రెస్ మీట్ లో కొడాలి నాని ఏదో చెప్పడం వల్ల ఇలాంటి పుకార్లు బయల్దేరాయి. నేను ఎవర్నీ కలవలేదు. టిక్కెట్ ఇవ్వమని అడగలేదు. మా కుటుంబానికి ముందు నుంచి రాజకీయ నేపథ్యం ఉంది. అందుకే నేను కూడా పాలిటిక్స్ లోకి వస్తున్నానని చాలామంది భావించారు. అలాంటి కథనాలు చదివి ఊరుకుంటాను. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు.”
అయితే ఇదంతా తన ప్రజెంట్ ఫీలింగ్ మాత్రమే అంటున్నాడు వినాయక్. ఎప్పటికైనా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. తను సినిమా డైరక్టర్ ని అవుతానని కలలో కూడా అనుకోలేదని, కానీ దర్శకుడిగా మారానని.. అలాగే రాసిపెట్టి ఉంటే రాజకీయాల్లోకి కూడా వస్తానంటున్నాడు వినాయక్.
Recent Random Post:

















