
సినిమా హీరోయిన్లంటే చాలా సుకుమారంగా వుంటారనే అభిప్రాయం వుంది. సినిమాల సంగతెలా వున్నా, రాజకీయాల్లోకొచ్చాక మాత్రం రోజా ‘ఫైర్ బ్రాండ్’గా మారిపోయిన విషయం విదితమే. గాలేరు నగిరి ప్రాజెక్ట్ పూర్తికావాలని ఆకాంక్షిస్తూ, రోజా పాదయాత్ర చేపడ్తున్నారు. అయితే, పాదయాత్ర అంత తేలికైన వ్యవహారం కాదు కదా.!
ఓ పక్క పార్టీ అధినేత వైఎస్ జగన్, సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన దరిమిలా, ఇంకోపక్క తన నియోజకవర్గంలో ప్రాపకం పెంచుకోవడం కోసం నగిరి ఎమ్మెల్యే రోజా కూడా పాదయాత్రకు సిద్ధమయ్యారు. కానీ, పాదయాత్రకు ముందు కొంత ‘ప్రిపరేషన్’ అవసరమన్న విషయాన్ని ఆమె గుర్తించలేకపోయారు. అక్కడే వ్యవహారం తేడా కొట్టేసింది.
పాదయాత్ర తొలి రోజే ఆమెకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. మరోపక్క, ఆమె నడుస్తున్నకొద్దీ కాలు నొప్పులు ఎక్కువపోయాయి. పాదాలు బొబ్బలు కట్టేశాయి. దాంతో, రోజాకి తక్షణ వైద్య సహాయం అందించారు. ఆమెకు ‘రెస్ట్’ అవసరమనీ, పాదయాత్ర కొనసాగించడం ప్రమాదకరమని వైద్యులు తేల్చారు. ప్రస్తుతం కాళ్ళు కింద పెట్టలేని పరిస్థితి రోజాది. అయితే, ఆమె మాత్రం పాదయాత్ర కొనసాగించి తీరతానంటున్నారు.
ఎవరు పాదయాత్ర చేయాలనుకున్నా, ముందస్తుగా కసరత్తులు చేస్తుంటారు. శరీరాన్ని పాదయాత్రకు అనుకూలంగా మలచుకోవాల్సిందే ఎవరైనా. లేనిపక్షంలో.. ఇదిగో ఇలాంటి సమస్యలే తలెత్తుతాయి. నిజానికి, జగన్ కూడా తొలి రోజు పాదయాత్రతో ఇబ్బంది పడ్డారు. తీవ్రమైన నడుం నొప్పి వేధించిందాయనకి. నడుముకి బెల్ట్ పెట్టుకుని పాదయాత్ర చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎలాగోలా సర్దుకుందనుకోండి.. అది వేరే విషయం.
అన్నట్టు, రోజా తన పాదయాత్ర ఫొటోలతోపాటు, కాళ్ళకు బొబ్బలెక్కిన ఫొటోల్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సానుభూతి పొందేస్తున్నారండోయ్.!
Recent Random Post: