లాక్ డౌన్ .. ఇండియాలో సక్సెస్ అవుతుందా?

జనతా కర్ఫ్యూ పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవరూ కూడా బయటకు రాకుండా అందరూ ఇంటిపట్టునే ఉన్నారు. ఆదివారం కావడంతో ఇది సాధ్యం అయ్యిందని అంచనా వేస్తున్నారు. జనతా కర్ఫ్యూ విధించిన కరోనా చైన్ ను బ్రేక్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇది మంచిదే.

అయితే, ఇక్కడే ఒక సమస్య వచ్చింది. జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పుడు మార్చి 31 వ తేదీ వరకు లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు. లాక్ డౌన్ అంటే నిత్యవసర వస్తువులు, ఇతర ఎమర్జెన్సీకి సంబంధించిన కార్యకలాపాలు తప్పించి మిగతా మొత్తం స్తంభించిపోవడం. అలా చేస్తేనే కరోనా వైరస్ కట్టడి చెయ్యొచ్చు. అయితే, ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది.

భారతదేశం లాంటి దేశాల్లో ప్రజలను బయటకు రాకుండా అడ్డుకోవడం సాధ్యం అవుతుందా? రోజువారీ పనులు చేసుకునే వ్యక్తులు కోట్లాదిమంది ఉన్నారు. వారికి రేషన్, ఇతర వస్తువులు ఇస్తామని అంటున్నారు. బాగానే ఉన్నది. మరి మధ్యతరగతి వ్యక్తుల పరిస్థితి ఏంటి? చాలామంది చిన్న చిన్న దుకాణాలు నడుపుకుంటూ ఉంటారు. అప్పులు చేసి ఏదోలా తిప్పలు పడి బండి నడిపిస్తుంటారు. రోజువారి పనులు నడిస్తేనే వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది.

బ్యాంకుల నుంచి, ఫైనాన్స్ కంపెనీల నుంచి అప్పులు తెచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతే వారి పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. వాళ్లకు ప్రభుత్వం ఎలాంటి మార్గం చూపిస్తుంది. వారిని ఎలా ఆడుకుంటుంది. ఒకరోజు రెండు రోజులు అంటే ప్రజలు ఇంట్లో ఉంటారు. అంతకు మించి ఎక్కువ రోజులు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలి అంటే సాధ్యం అయ్యే విషయం కాదని అనుకోవచ్చు. మరి ప్రభుత్వాలు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాయో చూడాలి.


Recent Random Post: