వరుణ్ తేజ్ హీరోగా ఫిదా-2

వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఫిదా సినిమా. ఇప్పుడీ సినిమా స్టోరీలైన్ కు దగ్గర్లో మరో సినిమా చేయబోతున్నాడు వరణ్ తేజ్. గతంలో నానితో “నిన్నుకోరి” లాంటి సెన్సిబుల్ లవ్ స్టోరీని తెరకెక్కించిన శివ నిర్వాణ, తన రెండో ప్రయత్నంగా వరుణ్ తేజ్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు.

ఫిదా సినిమాలో హీరోయిన్ కోసం స్ట్రగుల్ అయ్యే పాత్రలో కనిపించాడు వరుణ్ తేజ్. శివ నిర్వాణ సినిమాలో కూడా దాదాపు అదే స్ట్రగుల్ ఉంటుందట. స్టోరీలైన్ మారినప్పటికీ.. హీరోయిన్ కోసం పరితపించే యాంగిల్ మాత్రం యాజ్ ఇటీజ్ గా అలానే ఉంచారట. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ప్రాజెక్టు కనుక ఓకే అయితే డీవీవీ దానయ్య నిర్మాతగా ఇది సెట్స్ పైకి వస్తుంది.

నిన్నుకోరి సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ తో గుండెలు పిండేసిన శివ నిర్వాణ, తన రెండో సినిమాకు మాత్రం కాస్త ఎంటర్ టైన్ మెంట్ ఉండే స్క్రిప్ట్ రాసుకున్నాడట. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే శివ నిర్వాణ ప్రాజెక్టుపై ఓ నిర్ణయం తీసుకుంటాడు.


Recent Random Post: