
రామ్గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని ప్రకటించాడు. నిర్మాతతో కలిసి మీడియా ముందుకు కూడా వచ్చాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకి సంబంధించి పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చేశాడు వర్మ. ఇది నా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని వర్మ చెప్పాక, ఆ సినిమాకి నిర్మాతగా వైఎస్సార్సీపీ నేత పేరుని ప్రకటించాక, తెలుగుదేశం పార్టీ అలర్ట్ కాకుండా వుంటుందా.?
ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ, తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తానని చాన్నాళ్ళ క్రితమే ప్రకటించిన విషయం విదితమే. దానికి సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. ఆ సినిమాకి తానే దర్శకుడినంటూ తేజ తాజాగా ప్రకటించడం గమనార్హం. ఇలా వర్మ నుంచి క్లారిటీ రావడం, అలా తేజ నుంచి ప్రకటన రావడం.. అంతా యాదృశ్చికం అనుకోవాలా.?
ఎలాగన్నా అనుకోండి.. ఇప్పుడు ‘ఎన్టీఆర్’ అనే పేరుతో తెరకెక్కుతోన్న రెండు తెలుగు సినిమాలు ఇటు తెలుగు సినీ పరిశ్రమనీ, అటు తెలుగు రాజకీయాల్నీ చిన్నపాటి కలవరానికి గురిచేస్తున్నాయన్నది నిర్వివాదాంశం. మరీ ముఖ్యంగా ఈ రెండు సినిమాల్లో ఒకటి టీడీపీని తీవ్రంగా టెన్షన్ పెడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. తేజ రూపొందించబోయే సినిమా, టీడీపీకి కొంత మేర ఉపశమనం కల్పించొచ్చేమో.!
ఒక్కటి మాత్రం నిజం. వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి అతనే సుప్రీమ్. తేజ ‘ఎన్టీఆర్’కి మాత్రం బాలయ్య, చంద్రబాబు.. ఇలా ‘సుప్రీమ్స్’ చాలామందే వుంటారు. భారీతనం పరంగా చూసుకుంటే తేజ ‘ఎన్టీఆర్’కి మార్కులెక్కువపడ్తాయి. వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, 2018 ఫిబ్రవరిలో ప్రారంభం కానుండగా, తేజ ‘ఎన్టీఆర్’ జనవరిలో ప్రారంభమవుతుందట.
Recent Random Post: