
‘నా వస్త్రధారణపై చాలామందికి అభ్యంతరాలెక్కువ. మారుతున్న కాలానికి అనుగుణంగా కొందరు మారలేకపోతున్నారు. సమస్య వారిలోనే వుంది. నా వస్త్రధారణతో మిగతావారికి సమస్య లేదు. ప్రధానితో భేటీ అయ్యే అద్భుత అవకాశం కలిగినందుకు ఆనందిస్తున్న వేళ, నా వస్త్రధారణపై కొందరు దుష్ప్రచారం చేశారు. ఇంకా చాలా విషయాల్లో వేధింపులు ఎదుర్కొన్నాను. ఇంకా నా మీద వేధింపులు కొనసాగుతూనే వున్నాయి.. అలా నన్ను వేధిస్తున్నవారికి ఇదే సరైన సమాధానం..’ అంటోంది ప్రియాంకా చోప్రా.
ప్రపంచంలోనే 100 మంది ప్రభావవంతమైన మహిళల్ని ఫోర్బ్స్ లిస్ట్ ఔట్ చేస్తే, అందులో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రాకి 97వ స్థానం దక్కింది. ఈ లిస్ట్‌లో మొత్తం ఐదుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. బాలీవుడ్ నుంచి ఈ ఘనత అందుకున్న ఒకే ఒక్క నటి ప్రియాంకా చోప్రా కావడం గమనార్హం. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రియాంక ప్రయాణం, నటిగా ఆమె సాధించిన పేరు ప్రఖ్యాతులు, బ్రాండింగ్.. ఇలా చాలా అంశాలు ఆమెను ‘ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన మహిళల లిస్ట్‌లోకి చేర్చాయి.
‘ఈ ఘనత ఒక్క రోజులో సంపాదించింది కాదు. ఏళ్ళ తరబడి కష్టపడ్డాను. ఆ కష్టం ఒక ఎత్తు, విమర్శల్ని ఎదుర్కోవడం ఇంకో ఎత్తు. ప్రతి సందర్భంలోనూ నాకు అండదండగా నిలిచిన అభిమానులందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను..’ అంటూ ప్రియాంకా చోప్రా ఒకింత ఉద్వేగానికి లోనయ్యింది.
Recent Random Post:

















