శ్రియ ఎంతలా కష్టపడిందంటే.!

శ్రియ అండర్‌ వాటర్‌లో వున్న ఓ ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న విషయం విదితమే. ఈ ఫొటోని శ్రియ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ముందుగా ఆ కాన్సెప్ట్‌ గురించి ఫొటోగ్రాఫర్‌ చెప్పినప్పుడు శ్రియ చాలా భయపడిందట. నీటి అడుగున, ఫొటోసెషన్‌ అంటే మాటలు కాదు మరి.! పైగా, ఆ పోజు గురించి ముందే ఫొటోగ్రాఫర్‌ ఓ సూచన చేయడంతో, పెర్‌ఫెక్ట్‌గా ఆ పోజు వచ్చేందుకోసం శ్రియ చాలా కష్టపడాల్సి వచ్చిందట.

నీటి అడుగున స్టేబుల్‌గా వుండడం చాలా కష్టం ఎవరికైనా. శ్రియ కూడా అదే కష్టం ఫీలయ్యిందట. పలుమార్లు ఫొటోగ్రాఫర్‌ వరుసగా ‘క్లిక్స్‌’ ఇస్తూ ఇస్తూ చివరికి తాను అనుకున్న స్టిల్‌ పొందగలిగాడట. ఇందుకోసం ముందస్తుగా శ్రియ నీటిలో స్ట్రెయిట్‌గా స్టాండ్‌ అవడంపై శిక్షణ కూడా తీసుకుందట. ఆ ఫొటో ఒక్కటీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యిందిగానీ, ఇంకా చాలా కథే నడిచిందట మొత్తం ఫొటోసెషన్‌కి.

ఎలాగైతేనేం, పడ్డ కష్టానికి మంచి ప్రతిఫలమే దక్కిందని అంటోంది శ్రియ. ఆ ఫొటో సెషన్‌ ఎప్పటికీ తనకు చాలా ప్రత్యేకమైనదని శ్రియ చెబుతోంది. నిజమే, టూ పీస్‌ బికినీలో అండర్‌ వాటర్‌ శ్రియ స్టాండింగ్‌ తరహాలో దిగిన ఈ పోజు అంత తేలిగ్గా వైరల్‌ అయిపోలేదు మరి.. ఆ ఫొటో అంతగా ‘కిక్‌’ నెటిజన్లకు ఇచ్చింది.


Recent Random Post: