
శ్రీరెడ్డి తనను కోన వెంకట్ బలాత్కారం చేసాడని ఆరోపించింది. బంజారాహిల్స్ శ్మశానం వెనుక వున్న గెస్ట్ హవుస్ లో ఇది ఎప్పుడో జరిగిందని చెప్పింది. కొన్ని వాట్సప్ చాట్ షాట్ లు కూడా చూపించింది. వాటిలో దీనికి సంబంధించి ఏమీ లేవు కానీ, కొన్ని డిస్కషన్లు వున్నాయి. అంతే.
అయితే ఇప్పుడు ఈ విషయమై కోన వెంకట్ ఓపెన్ చాలెంజ్ చేసారు. ఆయన మాట్లాడుతూ, “తాను శ్రీరెడ్డిని కనీసం అయిదు నిమషాలు మాట్లాడినట్లు నిరూపించినా ఏ పనిష్ మెంట్ కైనా రెడీ” అని ఆయన అన్నారు. అవసరం అయితే లై డిటెక్టర్ టెస్ట్ కు తానే కోర్టును కోరుదామని రెడీ అయ్యానని, అయితే వెల్ విషర్లు ఓ ప్రాసెస్ ప్రకారం వెళ్లమని కోరడంతో ఆగానని ఆయన వెల్లడించారు.
తనను ఎందరో కలుస్తుంటారని, సాధారణంగా అలాంటపుడు ఓ సెల్ఫీ తీసుకుంటారని, ఔత్సాహికులయితే ఆ సెల్ఫీని తమ సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేసుకుంటారని, మరి తనను కలిసి వుంటే శ్రీరెడ్డి కూడా ఓ ఫొటోనో, సెల్ఫీనో తీసుకుని వుండాలి కదా అని ఆయన ప్రశ్నించారు.తాను ఎందరికో సాయం చేసానని, ఎందరికో అవకాశాలు ఇచ్చానని, ఇలాంటి ఆరోపణల వల్ల ఇకపై ఎవ్వరినీ కలవాలంటేనే ఆలోచించాల్సి వస్తోందని కోన వెంకట్ అన్నారు.
శ్రీరెడ్డి ఓ ప్లాన్ ప్రకారం సినిమా జనాలతో చాటింగ్ లు చేసి, వాటిలో తనకు అనుకూలమైనవి మాత్రం బయట పెడుతున్నట్లు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
Recent Random Post:

















