
హీరోలు లేడీ గెటప్స్ వేస్తేనే అదో పెద్ద సెన్సేషన్ అయి కూర్చుంటుంది. మరి, హీరోయిన్లు – మగాళ్ళ గెటప్ వేస్తే ఎలా వుంటుందట.? బాలీవుడ్‌లో రాణీ ముఖర్జీ ఆ మధ్య ఓ సినిమాలో ఇలాగే ‘మేల్’ గెటప్‌లో కన్పించి సందడి చేసింది. అయితే, హీరోయిన్లు ‘మేల్’ గెటప్ వేసి, ఎక్కువ సేపు ఆ గెటప్‌లో కన్పించడం.. ఆయా సినిమాలు సక్సెస్ అవడం చాలా అరుదైన విషయమే.
తెలుగులో ‘మేడమ్’ సినిమా కోసం రాజేంద్రప్రసాద్ లేడీ గెటప్ వేస్తే, అదో సూపర్ హిట్ సినిమా అయ్యింది. ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమాలో నరేష్ గెటప్ కూడా సక్సెస్ అయ్యింది. మొన్నీమధ్యనే ‘రెమో’ సినిమా వచ్చి, అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ మంచి మార్కులే వేయించుకుంది. శివకార్తికేయన్ లేడీ గెటప్ ఈ సినిమాకే హైలైట్‌గా మారింది. ‘భామనే సత్యభామనే’ అంటూ కమల్ పోషించిన లేడీ గెటప్‌ని ఎలా మర్చిపోగలం.?
లేడీ గెటప్స్ విషయాన్ని పక్కన పెడితే, సన్నీలియోన్ మేల్ గెటప్‌లో కన్పించబోతోంది ‘తేరా ఇంతెజార్’ సినిమా కోసమే ఈ ప్రయత్నం. ఆ ఫొటోల్ని ఆమె అలా సోషల్ మీడియాలో షేర్ చేయగానే, క్షణాల్లో వైరల్ అయిపోయిందా గెటప్. గెటప్ ఒక్కటే కాదండోయ్, బాడీ లాంగ్వేజ్ కూడా ‘మేల్’ తరహాలోనే వుండాలి కదా.! దానికోసమూ బాగానే కష్టపడిందట. జస్ట్ ఓ పాట కోసం సరదాగా వేసిన ఈ గెటప్‌కి మంచి రెస్పాన్స్ సోషల్ మీడియా నుంచి వస్తోందని అంటోంది సన్నీలియోన్.
‘ట్రాలర్స్ ఎప్పుడూ వుంటారు.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. సినిమాల్లో ఫుల్ లెంగ్త్‌లో మేల్ క్యారెక్టర్‌లో కన్పించాల్సి వస్తే.. అదీ ఇంట్రెస్టింగ్ కథాంశం వస్తే కన్పించడానికి రెడీ..’ అంటూ సన్నీలియోన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మొత్తమ్మీద, సన్నీలియోన్‌లో ఇదో కొత్త కోణం.. భలే భలే మగాడినోయ్.. అంటూ సన్నీలియోన్ ‘భల్లే భల్లే’ డాన్స్ చేస్తోంటే ఆ కిక్కే వేరప్పా అనుకోవాలేమో.!
Recent Random Post: