సమంత యాడ్ పై సానియా మీర్జా కామెంట్స్ వైరల్

స్టార్ హీరోయిన్ సమంత ఒక వైపు వరుసగా సినిమాలు మరియు సిరీస్ ల్లో నటిస్తూ మరో వైపు యాడ్ ఫిల్మ్స్ లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం పలు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి కంపెనీలకు సమంత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా పెప్సీ కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా సమంత ఎంపిక అయ్యింది.

సమంత పెప్సీ కంపెనీ కోసం నటించిన ఒక కమర్షియల్ యాడ్ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేసింది. నిమిషం లోపే ఉన్న ఆ వీడియో లో సమంత విభిన్నమైన గెట్స్ లో కనిపించింది. స్టంట్స్ చేస్తూ.. పెళ్లి కూతురుగా పలు విధాలుగా సమంత కనిపించింది. సమంత పెప్సీ యాడ్ వైరల్ అయ్యింది.

సమంత పెప్సీ వైరల్ వీడియో పై సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో సుదీర్ఘమైన పోస్ట్ తో ఈ వీడియో పై తన అభిప్రాయాన్ని తన ఫాలోవర్స్ తో మరియు నెటిజన్స్ తో సానియా మీర్జా పంచుకుంది.

సానియా మీర్జా తన పోస్ట్ లో… ఈ యాడ్ వీడియో చూస్తే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. అమ్మాయివి టెన్నిస్ క్రీడ అవసరమా… ఆడి ఏం సాధిస్తుందో అంటూ చాలా మంది వ్యాఖ్యానించారు. టెన్నిస్ మహిళలకు సంబంధించిన క్రీడ కాదు. నువ్వు ఎంత దూరం వెళ్లగలవు అన్నారు. కానీ నేను నా కలను సాధించేందుకు కష్టపడ్డాను.. ఎప్పుడూ కూడా నా కలను వదులుకోలేదు. ఎందుకంటే నేను నన్ను నమ్ముకున్నాను. మరియు సమాజం నా గురించి ఏమి మాట్లాడుతుందో నేను పట్టించుకోలేదు. సంకల్పంతో విజయాన్ని సాధించడానికి శక్తితో పైకి లేచాను అంది.

సమంత యొక్క పెప్సీ ప్రకటన నేటి తరం అమ్మాయిలకు ఆదర్శం… తమ కలలను సాధించుకోవడానికి ముందుకు సాగడానికి సరైన ప్రేరణగా నిలుస్తుందని సానియా మీర్జా పేర్కొంది. సమంత యాడ్ పట్ల సానియా స్పందించడంతో ఆ వీడియో మరోసారి వార్తల్లో నిలిచింది.