సూపర్ స్పీడ్ నాని: మరో సినిమా పూర్తిచేశాడు

మినిమం గ్యాప్ లో సినిమాలు రిలీజ్ చేస్తూ, జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న నాని తాజాగా మరో మూవీ కంప్లీట్ చేశాడు. ఈ హీరో ద్విపాత్రాభినయం చేసిన సినిమా కృష్ణార్జున యుద్ధం. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఓ ఫైట్ సీక్వెన్స్ తో ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తయింది.

కృష్ణార్జున యుద్ధం సినిమాకు సంబంధించి ఇప్పటికే నాని లుక్స్ రెండింటినీ విడుదల చేశారు. ఒకటి మాస్.. ఇంకోటి రాక్ స్టార్ లుక్. ఈ రెండు పాత్రల మధ్య సంబంధం ఏంటనేది కృష్ణార్జున యుద్ధం. ఒకటి తిరుపతి, ఇంకో క్యారెక్టర్ పారిస్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. మాస్ లుక్ లో కనిపిస్తున్న నాని, దొంగ పాత్ర చేసినట్టు తెలుస్తోంది.

అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకుడు. ఇప్పటికే సినిమాకు ప్రమోషన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 12న కృష్ణార్జున యుద్ధం థియేటర్లలోకి రానుంది.

ఇది రిలీజ్ అయిన వెంటనే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తాడు నాని. ఆ మూవీని కూడా అటుఇటుగా 2నెలల్లో పూర్తిచేసేలా స్కెచ్ రెడీ చేశారు.


Recent Random Post: