సొంతంగా డబ్బింగ్ చెప్పిన పవన్ హీరోయిన్

కొంతమంది హీరోయిన్లు డబ్బింగ్ విషయంలో బాగానే డెవలప్ అయ్యారు. ఒకప్పట్లా నటించేసి చేతులు దులిపేసుకోకుండా డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. ఈ లిస్ట్ లోకి తాజాగా పవన్ హీరోయిన్ కీర్తిసురేష్ కూడా చేరింది. త్రివిక్రమ్ ఇచ్చిన ప్రోత్సాహంతో అజ్ఞాతవాసి సినిమాకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.

తెలుగులో నేను లోకల్, నేను శైలజ సినిమాలు చేసింది కీర్తిసురేష్. పవన్ తో చేస్తున్న అజ్ఞాతవాసి సినిమా ఆమెకు మూడో ప్రాజెక్టు. అలా మూడో సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పే స్థాయికి చేరింది కీర్తిసురేష్. డబ్బింగ్ సందర్భంగా తీసిన ఓ ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మరికొన్ని గంటల్లో ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు పవన్ సొంతంగా ఓ ట్విట్టర్ ఎకౌంట్ కూడా క్రియేట్ చేశాడు. పీకే క్రియేటివ్ వర్క్స్ అనే ట్విట్టర్ ఎకౌంట్ లో మరికాసేపట్లో అజ్ఞాతవాసి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు.

సినిమాకు సంబంధించి ప్రస్తుతం వారణాసిలో ఫైనల్ షెడ్యూల్ నడుస్తోంది. అక్కడే దేవుడి సన్నిధిలో ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి రానుంది అజ్ఞాతవాసి.


Recent Random Post: