
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్.. బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహూజా వివాహం తాలూకు డ్యాన్సు వీడియో యుట్యూబ్ లో ఇంకా దుమ్మురేపుతూనే ఉన్నాయి. సెలబ్రిటీ మ్యారేజ్ కావడంతో ఈ పెళ్లికి సంబంధించిన ప్రతీ అంశం మీడియాలో బాగా హైలైట్ అవుతోంది. ఒకేసారి అన్ని సంగతులు కాకుండా.. ఒక్కోసారి ఒక్కోటీ చొప్పున రివీల్ చేస్తూ.. వీళ్లు కూడా థ్రిల్ చేస్తూనే ఉన్నారు.
పెళ్లి అన్నాక మంగళసూత్రం ప్రస్తావన తప్పకుండా వస్తుంది. తాళి బొట్టు.. నల్లపూసలు పెళ్లికి అసలు సిసలైన చిహ్నాలు. మరి సోనమ్ కూడా ఇప్పుడు తాళిబొట్టు ధరించడం సహజం. ఏదో షూటింగుల సమయాల్లో మినహాయిస్తే.. మెడలో మంగళసూత్రంతో దర్శనం ఇస్తుందని ఎక్స్ పెక్ట్ చేయచ్చు. కానీ సోనమ్ కపూర్ మెడలో కనిపించే తాళిబొట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. దీన్ని చాలా స్పెషల్ గా డిజైన్ చేయించారు కూడా. అది కూడా ఇలా ఉండాలంటూ సోనమ్ కపూర్ అడిగి మరీ చేయించుకుందట.
ఆభరణాలను కావాల్సినట్లుగా డిజైన్ చేయిస్తారు కానీ.. తాళిబొట్టుకు కూడా ఇలాంటివి ఉంటాయా అనుకోవచ్చు. వారి సాంప్రదాయం ప్రకారం తాళిబొట్టు మామూలుగానే ఉంటుంది. కానీ సోనమ్ సూచన ఏంటంటే.. నల్లపూసల మధ్యలో తన భర్తతో పాటు తన రాశులకు సంబంధించి సింబల్స్ ఉండేలా డిజైన్ చేయించింది. సోనమ్ ది మిథున రాశి.. ఆనంద్ ది సింహరాశి. ఈ రెండు రాశులకు సంబంధించిన సింబల్స్ ను నల్ల పూసల మధ్య డైమండ్ స్టడ్డెడ్ లాకెట్ తరహాలో అటూ ఇటూ ఉండేలా డిజైన్ చేయించింది సోనమ్. ఆ స్పెషల్ తాళిబొట్టుకు సంబంధించిన ఫోటో.. ఇప్పుడు నెట్ లో భలే వైరల్ గా చక్కర్లు కొడుతోంది.
Recent Random Post: