
టీవీ9, ఏబీఎన్ ను నిషేధించాలంటూ పవన్ బాహాటంగానే పిలుపునిచ్చారు
టీవీ9, ఏబీఎన్ వైఖరిని నాగబాబు నేరుగానే విమర్శించారు
ఈ రెండు ఛానెల్స్ పై అల్లు అరవింద్ విరుచుకుపడ్డారు.
కానీ.. ఇప్పుడు అదే టీవీ9 ఛానెల్ కు ప్రసార హక్కులు కట్టబెట్టారు మెగా ఫ్యామిలీ హీరోలు. అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ టీవీ9లో ప్రసారమైంది.కొన్ని ఛానెళ్లపై నిషేధం అంటూ మెగా ఫ్యామిలీ హీరోలు ఎత్తుకున్న నినాదం నా పేరు సూర్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ తో పూర్తిగా చప్పబడిపోయింది. నిజానికి ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పలు ఛానెళ్లలో ప్రసారమైంది. చాలా ఛానెళ్లకు ప్రసార హక్కులు కట్టబెట్టారు. టీవీ9ను ఆపాలనుకుంటే మెగా హీరోలు ఆపొచ్చు. కానీ ఆ పని చేయలేదు.
ఇప్పుడు నా పేరు సూర్య సినిమాకు ప్రచారం కావాలి. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎంత మందికి చేరువైతే యూనిట్ కు అంతమంచిది. అందుకేనేమో, పిలిచి మరీ టీవీ9కు కూడా అవకాశం ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. టీవీ9ను అడ్డుకోవాలంటూ పిలుపునిచ్చిన నాగబాబే, అదే ఛానెల్ కు అనుమతి ఇవ్వడం. అవును.. నా పేరు సూర్య సినిమాకు నాగబాబు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. అతడికి తెలియకుండా ఇలాంటి నిర్ణయాలు జరగవు కదా..టీవీ9కు అనుమతి ఇవ్వడమే కాకుండా.. మీడియాపై పరోక్షంగా విమర్శలు చేయడం కొసమెరుపు. అయితే ఈ మొత్తం వ్యవహారం మాత్రం పవన్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. ఓవైపు తమ హీరో ఛానెళ్లపై పోరాటం చేస్తుంటే, మరోవైపు అదే ఛానెల్ కు మెగా హీరో సినిమా ఈవెంట్ ప్రసార హక్కులు కట్టబెట్టడంపై వాళ్లు కోపంగా ఉన్నారు.
టీవీ ఛానెళ్ల నియంత్రణకు సంబంధించి రేపోమాపో మరోసారి హీరోలంతా సమావేశం కాబోతున్నారు. చిరంజీవి అధ్యక్షతను మీటింగ్ ఏర్పాటుచేసి, టీవీ ఛానెళ్లను ఎలా నియంత్రించాలనే అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నారు. తాజా పరిణామాలు గమనిస్తుంటే.. హీరోల మెగా మీటింగ్ కూడా నీరుగారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరి సినిమా రిలీజప్పుడు వాళ్లు ఇలా మీడియాకు కొమ్ముకాస్తుంటే ఉమ్మడి నిర్ణయం అసంభవం.
Recent Random Post:

















