
శంకర్ – రజనీకాంత్ కాంబినేషన్ అంటే ఆ కిక్కే వేరప్పా. నిజమే, దర్శకుడిగా శంకర్‌కి వున్న ఫాలోయింగ్, ఆయన సినిమాలకుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే, ఆ సినిమాపై క్రియేట్ అయ్యే హైప్‌కి ఆకాశమే హద్దు. వరుస ఫ్లాపులు వచ్చినా, రజనీకాంత్ కొత్త సినిమా అనగానే, ఆ సినిమాకి అయ్యే బిజినెస్ ఎవరూ ఊహించని రేంజ్‌లోనే వుంటుంది. మరి రజనీకాంత్ – శంకర్ కాంబినేషన్‌లో సినిమాకి అయ్యే బిజినెస్, ఆ సినిమాలకు క్రియేట్ అయ్యే హైప్ ఎలా వుంటుంది.? అది ఊహలకందనిది.
‘శివాజీ’ అయినా, ‘రోబో’ అయినా.. అలా భారీ అంచనాల నడుమ వచ్చినవే. అయితే, ఆ రెండు సినిమాలూ పూర్తిగా నిరాశపర్చకపోయినా, అంచనాల్ని అయితే అందుకోలేకపోయాయన్నది నిర్వివాదాంశం. ఈ రెండిట్లో ‘రోబో’ బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. అయినాగానీ, ‘ఆ ఇద్దరి రేంజ్‌కి తగ్గ సినిమాలు కావవి’ అన్న అభిప్రాయాలే విన్పిస్తాయి. ఈ నేపథ్యంలో ‘2.0’ (ఈ సినిమాని అలాగే వ్యవహరిస్తున్నారు కదా)పై హైప్‌తోపాటు సహజంగానే కొన్ని అనుమానాలూ వ్యక్తమవుతుంటాయి.
2017లోనే విడుదలవ్వాల్సిన ‘2.0’), కొన్ని కారణాలతో జనవరి నెలాఖరుకి వెళ్ళింది. అక్కడినుంచి, ఏప్రిల్‌కి రిలీజ్ షిఫ్ట్ అయ్యిందనే ప్రచారం జరగుతోంది. సినిమాకి వుండే గ్రాఫిక్స్ హంగుల నేపథ్యంలో ఆ ఆలస్యం అనివార్యమే. అయినాగానీ, ఏ సినిమా అన్నా కాస్తంత వెనక్కి వెళ్ళిందంటే సహజంగానే, ఆ సినిమాపై వుండే ఆసక్తి కొంత ‘తగ్గిపోతుంది’. ఇక్కడా అదే జరుగుతోందిప్పుడు.
కనీ వినీ ఎరుగని రీతిలో దుబాయ్‌లో ‘2.0’ ఆడియో విడుదల వేడుక జరిగిన తర్వాత కూడా, ‘ఆసక్తి తగ్గడం’ అంటే, అది సినిమాకి చాలా పెద్ద మైనస్‌గా చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ, అక్కడున్నది శంకర్.. ఎలా హైప్ పెంచాలో ఆయనకి బాగా తెలుసు. రజనీకాంత్ సినిమా వస్తోందంటే, అప్పటికప్పుడు అంచనాలు ఆకాశాన్నంటేస్తాయి. జనవరి నుంచి ఏప్రిల్‌కి మారిన రిలీజ్ డేట్ అక్కడైనా లాక్ అవుతుందా.? ఎప్పుడొచ్చినా, ఇదో అద్భుతమేనంటున్న నిర్మాతల మాటలు నిజమేనా.? వేచి చూడాల్సిందే.
Recent Random Post:

















