
సినిమాలో ఉన్నవే 3పాటలు.. ఆ 3పాటల్ని కూడా తీసేసి రిలీజ్ చేస్తారట. 2.0మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఇది. ఈ సినిమా నిడివి పాటలతో కలుపుకొని 2గంటల 10నిమిషాలు వచ్చింది. ఇప్పుడు వీటిలోంచి 3పాటల్ని, కొన్ని రొటీన్ సన్నివేశాల్ని తీసేసి పలు దేశాల్లో విడుదల చేస్తారట.
2.0సినిమాను ఏకంగా 16భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చైనాలో మాండరిన్ భాషలో, పలు దేశాల్లో ఇంగ్లిష్ వెర్షన్ లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చైనాతో పాటు ఇంగ్లిష్ వెర్షన్ లో 3పాటల్ని తీసేయాలని నిర్ణయించారు. వీటితో పాటు అక్కడక్కడ వచ్చే 2-3కామెడీ సీన్లు కూడా లేపేయాలని డిసైడ్ అయ్యారు. అలా హాలీవుడ్ సినిమా టైపులో గంట 45నిమిషాల నిడివితో 2.0ను రిలీజ్ చేయబోతున్నారు.
గతంలో బాహుబలి-2 విషయంలో కూడా ఇలానే చేశారు. సాంగ్స్, కొన్ని రొటీన్ సీన్స్ తీసేసి పక్కా స్క్రీన్ ప్లేతో విదేశాల్లో ప్రదర్శించారు. ఇప్పుడు 2.0కు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు
Recent Random Post: