సందేశాలకు మహేష్ గుడ్ బై

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకోవడంలో సఫలమయ్యాడు. గతంలో అనేక కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ఈ మధ్య కాలంలో చేస్తున్న అన్ని సినిమాల్లోనూ ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకుంటున్నాడు. మీరు గనక గమనిస్తే శ్రీమంతుడు సినిమా మొదలు… బ్రహ్మోత్సవం మహర్షి ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమాలో కూడా సందేశాలు ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు.

ఇవన్నీ కమర్షియల్ సినిమాలైనా అంతర్లీనంగా ఏదో ఒక సందేశాన్ని ప్రేక్షకులకు ఇచ్చేలా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తన 28వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్ లో రూపొందుతోందని తెలుస్తోంది.

ఇక దర్శకుడు త్రివిక్రమ్ గత సినిమాలను గనక మనం చూస్తే ఆయన కూడా ప్రతి సినిమాతోనూ ఏదో ఒక సందేశాన్ని ప్రేక్షకులకు పంచే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో కూడా మహేష్ బాబు చేత ఒక సందేశం ఇప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలు చేయాల్సి ఉంది. కేఎల్ నారాయణ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపంతో పోతోందనే సంగతి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

ఈ సినిమాతో మహేష్ బాబు ఈ సందేశాత్మక సినిమాల పరంపరకు బ్రేకులు వేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల మాట్లాడుతూ మహేష్ బాబు సినిమాతో ఎలాంటి సందేశం ఇవ్వటం లేదని రెస్టారెంట్ కి వెళ్లి తినే విందు భోజనంలా ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రతి ప్రేక్షకుడు తన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసే లైఫ్ టైం మేమోరిలా ఈ సినిమా ఉంటుందని ఆయన కామెంట్ చేశారు. కాబట్టి మహేష్ సందేశాత్మక చిత్రాలకు బ్రేకులు పడినట్టే చెప్పొచ్చు.