99 రూపాయలతో ఫేమస్ అయిపోయే ప్లాన్..!

0ఈ మధ్య చిన్న సినిమాలకే మంచి రెస్పాన్స్ వస్తుంది. స్టార్ హీరోలు పెద్ద సినిమాలకంటే కూడా కథ బాగుంటే చిన్న సినిమాలే భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఆసక్తికరమైన టైటిల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే.. వాటిని చక్కగా ఆదరిస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కొందరు చిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. వాళ్లే మేం ఫేమస్ టీం.

సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం మేం ఫేమస్. అయితే ఈ సినిమాను లహరి ఫిల్మ్స్ చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిపి నిర్మిస్తోంది. ఈ విలేజ్ ఫన్ డ్రామా సినిమాలో మణి ఏగుర్ల మౌర్య చౌదరి సూర్య సిరి రాసి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే అనురాగ్ రెడ్డి శరత్ చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తాజాగా ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది.

ఈ సినిమా టికెట్లను కేవలం 99 రూపాయలకే ఇచ్చి ఫేమస్ అయిపోయేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సినిమా విడుదలైన తొలి రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండబోతోంది. అంతే కాదండోయ్ సెలెక్టెడ్ థియేటర్లలో మాత్రమే ఆ అద్భుతమైన ఆఫర్ ను అందించబోతుంది చిత్రబృందం. నిజానికి 99 రూపాయలకే టికెట్ ఇవ్వడమనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని.

అయినప్పటికీ ఇలా చేయడం వల్ల చిన్ని సినిమాలకు బూస్టింగ్ ఇచ్చినట్లు ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ రోజు కొన్ని థియేటర్లలో 99 రూపాయలకే సినిమా టికెట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. చూడాలి మరి ఇది ఏ రేంజ్ లో హిట్టు కొట్టి అందరినీ అలరిస్తుందో. ఇటీవలే యూ/ఓ సర్టిఫికేట్ సాధించిన ఈ సినిమా రన్ టైమ్ ను 2.29.59 వద్ద లాక్ చేశారు.

మే 26వ తేదీన మేం ఫేమస్ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. చాలా రోజులుగా టాలీవుడ్ లో ఒక్క యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కూడా రాలేదు. అందులోనూ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండడంతో చాలా మంది ఈ సినిమాపై తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ పోస్టర్ ఫస్ట్ లుక్ లు సినిమా భారీ అంచనాలను నమోదు చేశాయి. చూడాలి మరి సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొట్టనుందో.