బాలయ్యతో తీస్తోంది చిరు కథ కాదు

మెగాస్టార్ చిరంజీవితో పూరి జగన్నాథ్ ‘ఆటో జానీ’ అనే సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకోవడం.. కానీ ఆ కథ సగం వరకే నచ్చిన చిరంజీవి పూరికి నో చెప్పేసి తన 150వ సినిమాగా ‘ఖైదీ నెంబర్ 150’ చేయడం తెలిసిందే. ఐతే చిరుతో అనుకున్న ‘ఆటోజానీ’ కథనే పూరి బాలయ్య కోసం కొంచెం మార్చేసి సినిమా మొదలుపెట్టాడని ఈ మధ్య ఓ ప్రచారం జరిగింది. చిరుతో అనుకున్న కథలో హీరో ఆటోవాలా అయితే.. బాలయ్య ట్యాక్సీ డ్రైవర్ అని కూడా ఊహాగానాలు వినిపించాయి. ఈ ప్రచారాన్ని పూరి ఖండించాడు. బాలయ్యతో చేస్తున్నది ఫ్రెష్ స్టోరీ అని చెప్పాడు.

‘‘బాలయ్యతో చేస్తున్న కథను మరే హీరోకూ చెప్పలేదు. నా దగ్గర కథలకు కొదవలేదు. ఇంకో పదేళ్లకు సరిపడా కథలు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఒక హీరోతో అనుకున్నది ఇంకో హీరోతో చేయాల్సిన అవసరం లేదు. ఎవరితో పని చేయాలనుకుంటానో వాళ్లకు సరిపోయే కథ తీసి.. దాన్ని డెవలప్‌ చేస్తాను. అసలు ‘దేశముదురు’ వరకు నేను ఒక్క కథ కూడా కొత్తగా రాయలేదు. ఆ కథలన్నీ నేను డైరెక్టర్‌ కాకముందు రాసుకున్నవే. నేను ఒక్క రోజులో కథ రాయగలను. పూర్తి స్ర్కిప్టును పదిహేను రోజుల్లో రాయగలను’’ అని పూరి తెలిపాడు.

మరి చిరుతో సినిమా సంగతేంటి అని పూరిని అడిగితే.. ‘‘ఆయనతో కచ్చితంగా సినిమా చేస్తా. ‘ఆటో జానీ’ ఫస్టాఫ్‌ నచ్చిందన్నారు కూడా. కానీ ఆయనతో ఉండే రాజకీయ నాయకులు సందేశం ఉండే సినిమా చేస్తే బాగుంటందని చెప్పడంతో ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు. లేకపోతే హ్యాపీగా ‘ఆటో జానీ’ తీసేవాడిని. ఏదేమైనా ఆయనతో సినిమా చేయాల్సిందే. అవకాశం వస్తే మెగాస్టార్‌ అంటే ఏమిటో నేను చూపిస్తా’’ అని పూరి అన్నాడు.


Recent Random Post: