
పూరి జగన్నాథ్ దశాబ్దం కిందట తీసిన ‘ఇడియట్’ అప్పట్లో ఓ సంచలనం. ఆ సినిమాతోనే రవితేజ స్టార్ అయిపోయాడు. ఐతే ‘ఇడియట్’ను అంతకంటే ముందు కన్నడలో ‘అప్పు’ పేరుతో తెరకెక్కించాడు పూరి. ఆ సినిమాతో లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ హీరోగా అరంగేట్రం చేశాడు.
‘అప్పు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయి అతణ్ని రాత్రికి రాత్రి స్టార్ హీరోను చేసేసింది. అప్పట్లో కన్నడ నాట కూడా పూరి పేరు మార్మోగిపోయింది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే తన తమ్ముడైన ఇషాన్‌ను హీరోగా పరిచయం చేసే బాధ్యతను పూరికి అప్పగించాడు కన్నడ నిర్మాత సి.ఆర్.మనోహర్. కానీ ‘రోగ్’
ఫలితం ఏమైందో తెలిసిందే.
‘రోగ్’కు తెలుగులో ఎలాంటి రిజల్ట్ వచ్చినా పర్వాలేదు. ఇక్కడ వసూళ్లేమీ రాకపోయినా ఇబ్బందేం లేదు. కానీ కన్నడలో ఇషాన్‌ను పునీత్ లాగా పెద్ద హీరో అయిపోతాడని ఆశించాడు మనోహర్. కానీ ‘రోగ్’ సినిమాకు కన్నడలో కూడా దారుణమైన ఫలితమే వచ్చింది. తెలుగులో మాదిరి కాకుండా కన్నడలో ‘రోగ్’కు మంచి హైపే వచ్చింది. మనోహర్ ఇప్పటికే అక్కడ పెద్ద నిర్మాత కావడంతో ఇషాన్ మీద బాగానే ఆసక్తి చూపించారు జనాలు. మరో పునీత్ వస్తున్నాడంటూ గట్టి ప్రచారం కూడా జరిగింది. కానీ తీరా చూస్తే పూరి ‘అప్పు’ దరిదాపుల్లో కూడా లేని సినిమాను అందించాడు. ‘రోగ్’ కన్నడలో కూడా పెద్ద ఫ్లాప్ అయింది. ఇషాన్ కెరీర్‌పై సందేహాలు రేకెత్తించింది. ఇంత ఖర్చు పెట్టి తమ్ముడిని హీరోగా అరంగేట్రం చేయిస్తే.. డబ్బులన్నీ పోగా.. ఇషాన్ హీరోగా కూడా నిలదొక్కుకోలేకపోయాడని మనోహర్ ఏడ్చే పరిస్థితి కనిపిస్తోందిప్పుడు.
Recent Random Post: