అల్లు అర్జున్‌ అయినా ఫ్లాపులకి బ్రేకేస్తాడా?

మెగా ఫ్యామిలీకి ధృవ, ఖైదీ నంబర్‌ 150 చిత్రాలతో ఊపొచ్చింది. మరీ ముఖ్యంగా మెగాస్టార్‌ రీఎంట్రీ ఇచ్చి మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటుకోవడంతో అభిమానులకి అంతులేని ఆనందం కలిగింది. కొంత కాలం పాటు మెగా ఆధిపత్యం మిస్‌ అవడంతో ఫాన్స్‌ నీరసించారు. ఈ టైమ్‌లో ఖైదీతో వారికి మళ్లీ ఉత్సాహమొచ్చింది.

అయితే ఆ ఆనందం ఎక్కువ సమయం లేకుండా ‘కాటమరాయుడు’ ఫ్లాప్‌ అయింది. పవన్‌కళ్యాణ్‌పై ఫాన్స్‌ పెట్టుకున్న ఆశల్ని ఈ చిత్రం వమ్ము చేసింది. అటు తర్వాత విన్నర్‌తో సాయి ధరమ్‌ తేజ్‌, తాజాగా మిస్టర్‌తో వరుణ్‌ తేజ్‌ కూడా ఫ్లాప్‌ అయ్యారు. వరుసగా మెగా హీరోల సినిమాలు ఫ్లాపవుతూ వుంటే ఫాన్స్‌లో మళ్లీ నీరసం కమ్ముకుంటోంది. ఇప్పటికే బాహుబలి పుణ్యమా అని ఇండస్ట్రీ హిట్‌ కలలు పూర్తిగా పక్కన పెట్టేసుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడిలా వరుస ఫ్లాపులు కూడా వేధిస్తుండే సరికి ఈ పరంపరకి బ్రేక్‌ వేసే మెగా సినిమా కోసం ఎదురు చూపులు ఎక్కువయ్యాయి. నెక్స్‌ట్‌ రాబోయే మెగా ఫ్యామిలీ సినిమా ‘దువ్వాడ జగన్నాథమ్‌’ కావడంతో ఈ పరంపరకి అల్లు అర్జున్‌ అయినా బ్రేకేస్తాడని చూస్తున్నారు. మరి దువ్వాడగా అల్లు అర్జున్‌ ఏం చేస్తాడనేది చూడాలి.


Recent Random Post: