
మెగా ఫ్యామిలీలో పెద్ద స్టార్లతో తప్ప రెజీనా కసాండ్రా అదే ఫ్యామిలీలోని యువ హీరోలందరితో నటించేసింది. సాయిధరమ్ తేజ్‌తో రెండు సినిమాల్లో వరుసగా నటించడం, ఇద్దరికీ మధ్య స్నేహం బలపడడంతో కొన్ని పుకార్లకి కూడా అది తావిచ్చింది.
ఇదిలావుంటే ఇప్పుడు రెజీనా స్థానంలో లావణ్య మెగా యువ హీరోలకి మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది. అల్లు శిరీష్‌తో, వరుణ్ తేజ్‌తో నటించేసిన లావణ్య త్వరలో సాయిధరమ్ తేజ్‌తో రొమాన్స్ చేయనుంది. తేజ్ హీరోగా బి.వి.ఎస్. రవి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జవాన్’లో లావణ్య హీరోయిన్గా ఎంపికైనట్టు సమాచారం. ఈ యువ హీరోలని దాటి చరణ్, అల్లు అర్జున్‌తో నటించే స్థాయికి రెజీనా చేరలేకపోయింది.
మరి లావణ్య అయినా వారి దృష్టిలో పడుతుందో లేదో చూడాలి. నటిగా మంచి పేరు తెచ్చుకున్న లావణ్య తన టాలెంట్‌ని మిస్టర్‌లో ఇంకోసారి చూపించింది కానీ దురదృష్టవశాత్తూ సినిమా సరిగా ఆడడం లేదు. జవాన్‌తో మళ్లీ లావణ్యకి బ్రేక్ వస్తుందేమో చూద్దాం.
Recent Random Post: