బాహుబలి-2తో ఢీ.. పబ్లిసిటీ స్టంటా?

‘బాహుబలి: ది కంక్లూజన్’తో పోటీ పడటానికి పెద్ద సినిమాలే భయపడుతున్నాయి. తెలుగులో మాత్రమే కాదు.. వేరే భాషల్లో కూడా దానికి పోటీగా సినిమాల్ని రిలీజ్ చేయడానికి భయపడుతున్నారు. బాలీవుడ్ వాళ్లు సైతం ఏప్రిల్ 28న చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ చేయట్లేదు. ముందు, తర్వాతి వారాల్లోనూ కొత్త సినిమాల్ని షెడ్యూల్ చేయడానికి జంకుతున్నారు.

ఐతే తెలుగులో మాత్రం చిన్న సినిమాలు ‘బాహుబలి: ది కంక్లూజన్’తో పోటీకి సై అంటున్నాయి. అవసరాల శ్రీనివాస్ మూవీ ‘బాబు బాగా బిజీ’ని ‘బాహుబలి-2’ వచ్చిన తర్వాతి వారాంతంలో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇదే ఆశ్చర్యం కలిగించే విషయమంటే.. బాహుబలి-2 విడుదలైన మరుసటి రోజే ఇంకో చిన్న సినిమాకు బెర్తు బుక్ చేశారు. ఆ సినిమా.. వెంకటాపురం.

వేణు మడికంటి అనే కొత్త దర్శకుడు.. ‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్ హీరోగా తెరకెక్కించిన సినిమా ‘వెంకటాపురం’. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ సినిమాకు అనుుకున్నట్లుగా బిజినెస్ కాక.. సరైన రిలీజ్ డేట్ దొరక్క వాయిదా పడింది. ఇప్పుడు ఉన్నట్లుండి ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

బాహుబలి-2ను ఢీకొడుతోందని మీడియాలో ప్రచారం జరిగితే సినిమాపై జనాల్లో ఆసక్తి పెరుగుతుందని.. మంచి పబ్లిసిటీ వస్తుందని ఈ డేట్ ఎంచుకున్నారేమో తెలియదు. ఐతే విడుదలకు ముందు పబ్లిసిటీ రావడం మాటేమో కానీ.. దానికసలు థియేటర్లు దొరుకుతాయా.. దొరికినా జనాలు దాన్ని పట్టించుకుంటారా.. బాహుబలి ప్రభంజనంలో ఈ సినిమా నిలుస్తుందా అన్నదే సందేహం.


Recent Random Post: