బాహుబలి ఎలా హిట్టయిందన్న స్టార్ డైరెక్టర్

‘బాహుబలి: ది బిగినింగ్’పై ప్రశంసలు మాత్రమే కురవలేదు. విమర్శలూ బోలెడన్ని వచ్చాయి. కథ లేదు.. సాంకేతిక హంగులే అన్నారు కొంతమంది. కథను అర్ధంతరంగా ముగించారు.. సగం సినిమానే చూపించారు.. ఇదేం సినిమా అన్నారు ఇంకొంతమంది. ఇంకా మరెన్నో విమర్శలు వచ్చాయి ఈ సినిమాపై.

విమర్శకులు.. సామాన్య ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే.. టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ సైతం ఈ సినిమా సక్సెస్‌పై సందేహం వ్యక్తం చేశాడట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. వి.వి.వినాయక్. ఆయన ఈ సినిమా ఇంత పెద్ద హిట్ ఎలా అయింది అని అడిగాడట. స్వయంగా ప్రభాసే ఈ విషయాన్ని వెల్లడించాడు.

‘‘బాహుబలి: ది బిగినింగ్ విడుదలైన కొన్ని రోజులకు వినాయక్ గారిని కలిశాను. ఆయన నాకు చాలా ప్రశ్నలు సంధించారు. సినిమాలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలియదు. శివగామి ఎందుకు చనిపోయిందో తెలియదు. దేవసేన ఎందుకు చెరసాలలో ఉందో తెలియదు. ఇలా సినిమా మొత్తంలో పది ప్రశ్నల దాకా ఉన్నాయని వినాయక్ చెప్పారు. మరి అన్ని ప్రశ్నలున్న సినిమా ఎలా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అని ఆయన అడిగారు. వినాయక్ గారు అడిగే వరకు సినిమాలో అన్ని ప్రశ్నలున్నాయని నాకు కూడా తెలియదు. ఆయన అలా అడిగాకే మా సినిమాను ప్రేక్షకులు ఎంతగా ప్రేమించారో.. అన్ని ప్రశ్నలున్నా సినిమాను ఎంత పెద్ద హిట్ చేశారో నాకు అర్థమైంది’’ అని ప్రభాస్ తెలిపాడు.


Recent Random Post: