
ఏప్రిల్‌లో షూటింగ్ ప్లాన్‌కి అనుగుణంగా జరగకపోవడంతో మహేష్ ‘స్పైడర్’ డిలే అవుతోంది. ఏప్రిల్‌లో కేవలం నాలుగైదు రోజుల షూటింగ్ మాత్రమే జరగడం వల్ల మరో యాభై రోజుల షూట్ మిగిలిపోయింది. మంచి డేట్ అనుకున్న జూన్ 23 మిస్ అవడంతో ఇక స్పైడర్‌ని ఆగస్టులో విడుదల చేయాలని అనుకుంటున్నారట.
ఆగస్టు 11న విడుదల చేయడానికి హిందీ, తమిళంలో క్లాష్ ఏర్పడుతుందని ఆగస్టు 25న విడుదల చేస్తే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నారని, ఒకవేళ యాక్షన్ పార్ట్ షూటింగ్ మరీ ఎక్కువ సమయం తీసుకున్నట్టయితే ఈ చిత్రం దసరాకి వెళ్లినా వెళుతుందని సినీ వర్గాల ద్వారా తెలిసింది. ఏడాదికి పైగా సెట్స్ మీద వున్న ఈ చిత్రానికి ఇప్పటికే బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయిందని, వంద కోట్ల బడ్జెట్‌లో అనుకున్న చిత్రం నూట ఇరవై కోట్లపైనే అయ్యేటట్టు వుందని టాక్ వినిపిస్తోంది.
మూడు భాషల్లోను కలిపి నూట యాభై కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనాలున్నాయి కనుక ప్రస్తుతానికి నిర్మాతలు వర్రీ కావడం లేదు. అయితే బడ్జెట్ పెరగడం వల్ల తమిళ, హిందీ మార్కెట్ల నుంచి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగకపోతే మాత్రం చిక్కులు తప్పవంటున్నారు. ఏ సినిమాకీ వంద రోజులు మించి వర్కింగ్ డేస్ తీసుకోని మురుగదాస్ మొదటిసారి ఇలా కంట్రోల్ తప్పడం గురించి ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.
Recent Random Post: