
ఒక తెలుగు సినిమా గురించి దుబాయ్‌లోని అన్ని పత్రికలు మెయిన్ పేజ్ కవరేజ్‌తో పబ్లిసిటీ ఇవ్వడం అక్కడి తెలుగువారిని విస్మయపరుస్తోంది. ఏదైనా అవార్డు వేడుకలు జరిగితే తప్ప తెలుగు సినిమాని పట్టించుకోని దుబాయ్ పత్రికలు బాహుబలికి ఈ రేంజ్ కవరేజ్ ఇవ్వడం తెలుగువారికి అమితానందాన్నిస్తోంది.
హాలీవుడ్, చైనీస్ లేదా అప్పుడప్పుడు బాలీవుడ్ చిత్రాలు తప్ప మరి దేనిని అక్కడి మీడియా పట్టించుకోదట. కానీ బాహుబలి చిత్రానికి వస్తోన్న వసూళ్ల ప్రభంజనంతో మీడియా ఈ చిత్రానికి బాజా వాయించక తప్పలేదు. ఇప్పటికే లక్షా ఇరవై వేల అడ్మిషన్లతో యుఎఈలో చరిత్ర సృష్టించిన బాహుబలి అక్కడి బాక్సాఫీస్ చరిత్రని తిరగరాస్తుందని బల్ల గుద్ది చెబుతున్నారు.
దుబాయ్‌లో వున్న క్రేజ్‌ని గుర్తించే బాహుబలి టీమ్ అందరూ కలిసి దుబాయ్ వెళ్లి అక్కడి తెలుగువారిని మీట్ అయి వచ్చారు. తెలుగు సినిమా వరకు ఓవర్సీస్ బిజినెస్ అంటే కేవలం అమెరికా వసూళ్లని, కొంతవరకు యుఏఈ మార్కెట్‌ని మాత్రమే లెక్కించేవారు.
కానీ బాహుబలితో తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంతవరకు తెలుగు సినిమా స్క్రీన్ అవని దేశాల్లోను బాహుబలి ఓం దిద్దుతోంది.
Recent Random Post: