‘రోబో’ కోసం ‘బాహుబలి’ని తొక్కేస్తున్నారా?

భారతీయులు అందరికంటే ప్రాంతీయాభిమానం ఎక్కువని తమిళుల గురించి చెప్పుకుంటారు. తమ సినిమాలని తప్ప వేరే చిత్రాలని చాలా అరుదుగా ఆదరించే తమిళ జనం, బాహుబలి విషయంలో మరోసారి తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇండియాతో పాటు అన్ని దేశాల్లోను బాహుబలి అదరగొడుతూ వుంటే, తమిళనాడులో మాత్రం వసూళ్లు మామూలుగా వస్తున్నాయి.

కేరళ, కర్నాటకతో పాటు ఉత్తర భారతంలో రికార్డులు తిరగరాస్తోన్న ‘బాహుబలి 2’ తమిళనాడులో రికార్డులు పగలగొట్టడం లేదు. నాలుగు రోజుల్లో ముప్పయ్‌ ఎనిమిది కోట్ల గ్రాస్‌ వసూళ్లు మాత్రమే వచ్చాయి. హిందీలోకి అయినా అనువదించారేమో కానీ, తమిళంలో మాత్రం విడిగా షూట్‌ చేసారు.

అచ్చమైన ద్విభాషా చిత్రంగా దీనిని తెరకెక్కించారు. అయినప్పటికీ తమిళ జనం దీనిని ఓన్‌ చేసుకోవడం లేదు. దక్షిణాది రికార్డులంటే రజనీకాంత్‌ లేదా శంకర్‌ పేరిట వుండేవి. సౌత్‌ సినిమా అంటే ముందుగా తమిళ దర్శకులు, హీరోల గురించే ప్రస్తావన వచ్చేది. ఇప్పుడు రాజమౌళి పేరు అంతటా మార్మోగిపోతోంది.

ఈ చిత్రం సాధించిన ఘనత తమిళ వాళ్లకి నచ్చడం లేదా? ఈ సంచలనానికి తమ కాంట్రిబ్యూషన్‌ వుండకూడదని అనుకుంటున్నారా? ‘రోబో 2.0’తో రికార్డులన్నీ బద్దలైపోవాలని ఎదురు చూస్తున్నారా? ‘బాహుబలి 2’ చిత్రం విషయంలో తమిళ వాళ్లలో చాలా మంది స్పందన చూస్తే ఈ వాదన నిజమే అనిపించక మానదు.


Recent Random Post: