
తెలుగు చిత్ర సీమకి బాహుబలి 1 ఇండస్ట్రీ హిట్‌గా వుంటే, దానిని బ్రేక్ చేసే దిశగా బాహుబలి 2 సాగుతోంది. అలాగే కర్నాటకతో పాటు బాలీవుడ్‌లో కూడా బాహుబలి 2కి ఇండస్ట్రీ హిట్ స్టేటస్ దక్కనుంది. కేవలం ఇండియాలోనే కాకుండా మరో దేశంలోను బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టబోతోంది. నేపాల్ దేశంలో ఇప్పటికే బాహుబలి చిత్రానికి పది కోట్ల గ్రాస్ వసూలైంది.
నేపాల్‌లో పదిహేడు కోట్ల గ్రాస్‌తో ‘చక్క పంజా’ అనే చిత్రం టాప్‌లో వుందట. ఆ రికార్డుని బాహుబలి త్వరలోనే బీట్ చేస్తుందని, కేవలం నాలుగు రోజుల్లో పది కోట్లు వసూలు చేసిన చిత్రం నేపాల్ చరిత్రలోనే లేదని, ఇండియాని ఊపేస్తోన్న ఈ చిత్రమేంటో చూడాలని నేపాల్ జనం బారులు తీరుతున్నారని అక్కడ్నుంచి సమాచారం.
మరో వారం రోజుల్లో నేపాల్‌లో బాహుబలి ఇండస్ట్రీ హిట్‌గా అవతరించనుందట. నేపాల్‌లోనే కాకుండా ఇంకా చాలా దేశాల్లో బాహుబలి 2 ఎంత వసూలు చేస్తోందనేది సరిగా ట్రాక్ కావడం లేదు. నాలుగు రోజుల్లో ఆరు వందల కోట్ల గ్రాస్ అనేది కేవలం అంచనానే అని, ఇంకా లెక్క తేలని, లెక్కలు తెలియని కలెక్షన్ల వివరాలు చాలానే వున్నాయని, పలు దేశాల్లో కలెక్షన్ ట్రాకింగ్ అసలు జరగడం లేదని, కనుక ఇంత వచ్చి వుంటాయంటూ ఒక అంచనా వేసి వివరాలు చెబుతున్నారని ట్రేడ్ సర్కిల్స్ వారే చెబుతున్నారు.
ఏదేమైనా ఇంతవరకు బాలీవుడ్ సినిమాలు కూడా రికార్డులు దక్కించుకోని నేపాల్‌లాంటి దేశంలో మన తెలుగు సినిమా వెళ్లి ఇండస్ట్రీ రికార్డు కొడుతోందంటే సూపర్ కదూ.
Recent Random Post: