మహేష్‌బాబుకి కూడా ధైర్యం వచ్చింది

మురుగదాస్‌తో చేస్తోన్న స్పైడర్‌ చిత్రం ఆలస్యమవుతూ వుండడం మహేష్‌బాబుని కాస్త అసహనానికి గురి చేస్తోందనే వదంతులు వినిపించాయి. జూన్‌ 23 డేట్‌ని మిస్‌ అయిన ఈ చిత్రం ఆగస్టు నెలాఖరులో కానీ రిలీజ్‌ కాదనేది తాజా సమాచారం. వాయిదా పడడం పట్ల మహేష్‌ నిరుత్సాహపడినప్పటికీ క్వాలిటీ పరంగా రాజీ పడకపోవడం వల్లే మురుగదాస్‌ ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు కనుక అతను ఈ డిలేని పట్టించుకోవట్లేదు.

బాహుబలి 2 చిత్రంతో తెలుగు సినిమాకి ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ ఓపెన్‌ అవడం, దక్షిణాది చిత్రాలని చిన్నచూపు చూసే నార్త్‌ ఆడియన్స్‌ ఇప్పుడు సౌత్‌ నుంచి రాబోతోన్న చిత్రాలపై ఆసక్తి చూపించడం ‘స్పైడర్‌’కి కలిసి వస్తుందని మహేష్‌ ఆశిస్తున్నాడు.

మురుగదాస్‌ ఎలాగో నార్త్‌ ఆడియన్స్‌కి తెలిసిన దర్శకుడే కావడంతో స్పైడర్‌ ఖచ్చితంగా బాలీవుడ్‌ నుంచి డీసెంట్‌ కలక్షన్స్‌ రాబడుతుందని అనుకుంటున్నారు. అలాగే తమిళనాడులో కూడా మురుగదాస్‌ బ్రాండ్‌ ఈ చిత్రానికి బాగా హెల్ప్‌ అవుతుంది. బాహుబలి వల్ల యుఎస్‌ మార్కెట్‌ పొటెన్షియల్‌ ఏంటనేది తెలిసింది.

దీని వల్ల మహేష్‌ సినిమాకి కనీసం రెండు మిలియన్లు అదనంగా కలిసి వస్తుందని అనుకుంటున్నారు. స్పైడర్‌ డిలే కారణంగా మొదట్లో బెంగపడ్డా కానీ బాహుబలి 2 రిజల్ట్‌ తర్వాత టీమ్‌లో ఉత్సాహం కదం తొక్కుతోందని రిపోర్ట్స్‌ వస్తున్నాయి.


Recent Random Post: