
దర్శకుడిగా మంచి ఇమేజ్ సంపాదించిన సుకుమార్.. ‘కుమారి 21 ఎఫ్’తో నిర్మాతగానూ మారాడు. పెద్ద సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దాని తర్వాత తన అన్న కొడుకు అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘దర్శకుడు’ అనే సినిమాను సుకుమార్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు సుక్కు తమిళంలోనూ ఓ సినిమాను నిర్మించడానికి రంగం సిద్ధం చేయడం విశేషం. మ్యూజిక్ డైరెక్టర్ టర్న్డ్ హీరో జి.వి.ప్రకాష్ కుమార్ ఆ సినిమాలో కథానాయకుడిగా నటించనున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘100 పర్సంట్ లవ్’కు ఇది రీమేక్ కావడం విశేషం.
చంద్రమౌళి అనే కొత్త దర్శకుడు ‘100 పర్సంట్ లవ్’ తమిళ రీమేక్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు హీరోయిన్ ఎవరన్నది ఖరారవ్వలేదు. ఓ తమిళ నిర్మాతతో కలిసి సుక్కు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘దిల్ వాలే’ లాంటి భారీ సినిమాలకు ఛాయాగ్రహణం అందించిన డూడ్లీని ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ఎంచుకున్నాడు సుక్కు.
‘జగడం’, ‘ఆర్య-2’ లాంటి ఫెయిల్యూర్ల తర్వాత సుక్కును మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన సినిమా ‘100 పర్సంట్ లవ్’. నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించింది. సుక్కు తనదైన శైలిలో ఈ లవ్ స్టోరీని తెరకెక్కించి ప్రేక్షకుల మనసులు గెలిచాడు. ‘100 పర్సంట్ లవ్’ ఇప్పటికే బెంగాలీలో రీమేక్ అయింది .
Recent Random Post:

















