వివేగం టీజర్ పిచ్చెక్కించేసిందిగా…

వివేగం.. ఇది తమిళ సినిమానే తెలుగు ప్రేక్షకుల్లో కూడా దీని గురించి చాన్నాళ్లుగా చర్చ నడుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విషయంలో చెలరేగిన వివాదమే దీనికి కారణం. అందులో చూపించిన హీరో అజిత్ సిక్స్ ప్యాక్ లుక్ ఒరిజినల్ కాదని.. వీఎఫెక్స్ ద్వారా ప్యాక్స్ సృష్టించారని యాంటీ ఫ్యాన్స్ అప్పట్లో చేసిన రచ్చతో సోషల్ మీడియాలో చాలా చర్చ నడిచింది. ఐతే ఈ లుక్ మీద చర్చను మళ్లించేందుకు ‘వివేగం’ టీం తర్వాత ఇంకో రెండు లుక్స్ రిలీజ్ చేసింది కానీ.. అవేమంత కిక్కు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ‘వివేగం’ టీజర్ రిలీజ్‌కు సన్నాహాలు చేయగానే.. ఇది ఎలాంటి కామెడీకి దారి తీస్తుందో అన్న సందేహాలు నెలకొన్నాయి.

ఐతే బుధవారం అర్ధరాత్రి రిలీజ్ చేసిన ‘వివేగం’ టీజర్ ఎలాంటి కామెడీకి అవకాశం ఇవ్వలేదు. ఈ పవర్ ప్యాక్డ్ టీజర్ అజిత్ అభిమానుల్నే కాదు.. మామూలు జనాల్ని కూడా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మొత్తం ఫారిన్ బ్యాక్ డ్రాప్‌లోనే సాగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముందు ఆర్మీ అఫీషియల్‌గా ఉండి.. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంతో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారే పాత్రలో కనిపిస్తున్నాడు అజిత్. సినిమాను యాక్షన్ ప్యాక్డ్‌గా తీర్చిదిద్దినట్లున్నారు. విజువల్స్ అదిరిపోయాయి. టీజర్ అంతా కూడా టెక్నికల్ వాల్యూస్‌ స్పష్టంగా కనిపించాయి. అజిత్ లుక్ అదిరిపోయింది. నెవర్ గివ్ అప్ అనే మోటోతో అజిత్ చెప్పిన డైలాగులు అభిమానుల్ని అలరించేవే. ఈ టీజర్‌కు 12 గంటల్లోపే 2.3 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. లైక్స్ కూడా రెండు లక్షలు దాటిపోయాయి.


Recent Random Post: