
మహేష్‌బాబు ‘బ్రహ్మూత్సవం’ తర్వాత కొద్ది రోజులు కనిపించకుండా పోతే మురుగదాస్ సినిమా కోసం గెటప్ మారుస్తున్నాడని, సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ మహేష్ ఎప్పటిలా తన డ్రస్సింగ్ తప్ప మరేమీ మార్చకుండా మురుగదాస్ ‘స్పైడర్’ చేసేసాడు. కొరటాల శివ తీయబోతున్న ‘భరత్ అనే నేను’ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడంటే మెచ్యూర్డ్ లుక్ వుంటుందని భావించారు. ఈ సినిమాలో మహేష్ ఖచ్చితంగా గెటప్ మారుస్తాడని అనుకున్నారు.
కానీ మహేష్ ఎప్పటిలా తన రెగ్యులర్ లుక్ ఇందులోను మెయింటైన్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన లుక్ ఓకే అయిపోయింది. దీనికి సంబంధించిన ఫోటో షూట్ చేసి, మహేష్ ఎలా కనిపించాలనేది ఫిక్స్ చేసేసారు. ప్రస్తుతం స్పైడర్ షూటింగ్‌లో వున్న మహేష్ ఇప్పటికిప్పుడు కొత్త గెటప్ ట్రై చేసే అవకాశం లేదు.
అది పూర్తి కాకుండానే కొరటాల చిత్రానికి లుక్ ఫైనలైజ్ అయిందంటే ఇక ఇదే లుక్ కంటిన్యూ చేస్తున్నాడనేది క్లియర్ అయిపోయింది. కనుక మహేష్‌ని కొత్తగా చూడాలనుకునే వారు కనీసం మహేష్ చేసే తదుపరి చిత్రం వరకు వేచి చూడక తప్పదు మరి.
Recent Random Post: