అల్లు అర్జున్‌ని వదిలేసిన పవన్‌ ఫాన్స్‌

చెప్పను బ్రదర్‌ కాంట్రవర్సీతో పవన్‌ ఫాన్స్‌కి విలన్‌ అయిన అల్లు అర్జున్‌పై పవర్‌స్టార్‌ ఫాన్స్‌ ఎలా పగ తీర్చుకున్నారనేది తెలిసిందే. దువ్వాడ జగన్నాథమ్‌ టీజర్‌కి రికార్డు స్థాయిలో డిజ్‌లైక్స్‌ కొట్టి అల్లు అర్జున్‌ టీమ్‌కి, దువ్వాడ జగన్నాథమ్‌ బృందానికి నిద్ర లేకుండా చేసిన పవన్‌ ఫాన్స్‌ ఆ తర్వాత కూడా బన్నీ వీడియోలని, డిజె లింక్స్‌ని డిజ్‌లైక్‌ చేస్తూనే వచ్చారు. అయితే వారికి కూడా ఇది బోర్‌ కొట్టేసినట్టుంది.

డిజె వీడియో సాంగ్‌ విడుదల చేస్తే పవన్‌ ఫాన్స్‌ అంత యాక్టివ్‌గా డిజ్‌లైక్స్‌ కొట్టలేదు. మామూలుగా కంటే ఎక్కువ డిజ్‌లైక్స్‌ నమోదైనప్పటికీ, టీజర్‌తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. ఇప్పుడే ఇలా ర్యాగింగ్‌ చేస్తోన్న పవన్‌ ఫాన్స్‌ సినిమా రిలీజ్‌ అయ్యాక ఎక్కడ నెగెటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేస్తారోననే బెంగ బన్నీ క్యాంప్‌లో వుండేది. వీడియో సాంగ్‌కి డిజ్‌లైకర్స్‌ బెడద తగ్గుముఖం పట్టడంతో ముందు ముందు తలనొప్పులేం వుండవనే నమ్మకాలు కలుగుతున్నాయి.

అయితే సినిమా విడుదల వరకు సైలెంట్‌గా వుండాలని డిసైడ్‌ అయ్యారో లేక నిజంగానే ఇక బన్నీని పట్టించుకోవడం మానేసారో తెలియాలంటే ‘దువ్వాడ జగన్నాథమ్‌’ రిలీజ్‌ వరకు చూడాలి. ఇదిలావుంటే ఏ వీడియో పెట్టినా సూపర్‌హిట్‌ అయిపోతూ, మంచి రెస్పాన్స్‌ వస్తూ వుండడంతో ‘డిజె’ టీమ్‌ సంబరాల్లో మునిగిపోయింది. ఈ హైప్‌తో బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు ఖాయమనే కాన్ఫిడెన్స్‌ బిజినెస్‌ వర్గాల్లోను పెరుగుతోంది.


Recent Random Post: