బాహుబలితో పోలిక వాళ్లెలా ఒప్పుకుంటున్నారు?

బాహుబలి 2 అంతటి ఘన విజయం సాధించడంతో రాబోయే పెద్ద సినిమాల రేట్లు చుక్కలని తాకుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆ చిత్రాన్ని బెంచ్‌ మార్క్‌గా పెట్టుకుని, దాంట్లో సగం రేట్లు కోట్‌ చేస్తున్నారు. ఇంతకుముందు కంటే అరవై, డెబ్బయ్‌ శాతం రేట్లు పెంచి నిర్మాతలు చెబుతున్నా కానీ కిమ్మనకుండా బయ్యర్లు కొనేస్తున్నారు. బాహుబలి 1 తర్వాత వచ్చిన భారీ చిత్రాల్లో ఎన్ని అంచనాలకి తగ్గట్టు ఆడాయి? అసలు బాహుబలి 2తో పోల్చుకునే అర్హత త్వరలో రాబోతున్న సినిమాల్లో ఎన్నిటికి వుంది? బాహుబలి 2 అంత సంచలనం అవడానికి చాలా కారణాలు దోహదపడ్డాయి.

ఆ చిత్రాన్ని టాక్‌తో సంబంధం లేకుండా చూడాలని జనం ఫిక్స్‌ అయ్యారు. విడుదలకి ముందు హైప్‌ హిస్టారికల్‌ లెవల్లో వుండడంతో, మంచి టాక్‌ వచ్చేసరికి కలక్షన్ల ప్రభంజనం సృష్టించింది. మళ్లీ అలాంటి సంచలనం కావాలంటే ఏ సినిమాకి అయినా అలాంటి ప్రత్యేక హంగులు చాలా వుండాలి. దానికి వచ్చాయి కనుక దీనికీ వస్తాయని రేట్లు ఎక్కువ చేసి చెప్తే, దానిని చూసేందుకు వచ్చినట్టే జనం దీనిని చూడ్డానికి కూడా రావాలనే సంగతి గుర్తుంచుకోవాలి.

అసలు దాంతో పోలిక పెట్టి రేట్లు పెంచుతున్నపుడు, ఫలానా హీరోల గత చిత్రాల ఫలితాలని చూపించి దానికి అనుగుణంగా అమ్మాలని ఎందుకు అడగరు? చూస్తూ, చూస్తూ కోట్ల కొద్దీ డబ్బుతో లాటరీ ఆడడం వీరికి ఎందుకంత సరదా?


Recent Random Post: