
బాహుబలి 2 ఇండియన్ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసేయడంతో రాజమౌళి కాస్త గీత దాటి మాట్లాడేస్తున్నాడని అతని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. శివగామి పాత్రకి శ్రీదేవిని తీసుకోకపోవడం తమ అదృష్టమంటూ అంతటి నటిపై చీప్ కామెంట్ చేసాడు. అలాగే రికార్డుల పిచ్చికి తాను వ్యతిరేకం అని చెప్పుకోవడానికి అల్లు అరవింద్‌పై బురద జల్లాడు.
‘మగధీర’ వంద రోజులు ఆడిన సెంటర్ల కంటే ఎక్కువ వేసారని, అది తనని బాధించడం వల్ల వంద రోజుల వేడుకకి కూడా రాలేకపోయానని రాజమౌళి తనలోని సున్నిత కోణాన్ని ఆవిష్కరించుకున్నాడు. అన్నిట్లో నిజాయతీగా వుండేవాళ్లు ఇలాంటి నీతి వాక్యాలు వల్లించినా బాగానే వుంటుంది కానీ, ‘కాపీ మాస్టర్’గా పేరు పడ్డ రాజమౌళి ఇలాంటి మాటలు చెప్పడం హాస్యాస్పదమని సోషల్ మీడియాలో, సినిమా ఫోరమ్స్‌లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘మగధీర’ సినిమాలో ఎన్నో హాలీవుడ్ చిత్రాల్లోని షాట్లు యథాతథంగా కాపీ కొట్టిన రాజమౌళి అంతకుముందు సై, ఛత్రపతి, విక్రమార్కుడు తదితర చిత్రాల్లోను తన కాపీ టాక్టిక్ట్స్ చూపించాడు. మర్యాద రామన్న సినిమానైతే పూర్తిగా అవర్ హాస్పిటాలిటీనుంచి కాపీ కొట్టి తమ సొంత తెలివిగా మార్కెట్ చేసుకున్నారు.
ఈగ చిత్రం కాన్సెప్ట్ దగ్గర్నుంచి సీన్ల వరకు చాలా వాటినుంచి కాపీ కొట్టారు. బాహుబలిలో కూడా కాపీ సీన్లు, షాట్లు చాలానే వున్నాయి. తనకింద ఇంత నలుపు పెట్టుకుని, ఒక అగ్ర నిర్మాతపై ఇలాంటి వ్యాఖ్యలు పబ్లిక్‌గా చేయడం ఎంతవరకు సబబు అనేది ఇప్పుడు చాలా మంది సంధిస్తోన్న ప్రశ్న. సెంటర్లు పెంచి వేసుకోవడమనేది అప్పట్లో ఒక పిచ్చి. అభిమానుల ఆనందం కోసం నిర్మాతలు ఆబ్లిగేషన్‌పై అవి వేసేవారు. ఆ సంగతి అందరికీ తెలిసిన సంగతే అయినప్పటికీ దానిని భూతద్దంలో చూపించి, అల్లు అరవింద్‌ని బ్యాడ్ లైట్లో చూపించడం రాజమౌళికి ఎంతవరకు సబబు? తను, తన అన్న కీరవాణి చేసే మేథోచౌర్యం కంటే పెద్ద అఫెన్సా ఇది? ఈ రికార్డుల వల్ల ఎవరికీ నష్టం వుండదు కానీ, అవతలి వాడి క్రియేటివిటీని దొంగిలించడం కరెక్టా మరి?
Recent Random Post: