![ALLU ARJUN]](https://teluguz.com/wp-content/uploads/2017/01/ALLU-ARJUN-263x198.png)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. నెమ్మదిగా తన మార్కెట్‌ను బాగా విస్తరించేస్తున్నాడు. కేరళలో అతను ఇప్పటికే పెద్ద స్టార్. అక్కడి పెద్ద హీరోల సినిమాల స్థాయిలోనే బన్నీ చిత్రాలు రిలీజవుతుంటాయి. ఇక కర్ణాటకలోనూ అతడికి మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళనాడులోనూ పర్వాలేదు. ఈ మధ్య బన్నీ ఉత్తరాదిన కూడా ఫాలోయింగ్ బాగా పెంచుకుంటున్నాడు. కేరళలో మాదిరే బన్నీ ప్రమేయం లేకుండా అతడి మార్కెట్ విస్తరిస్తోంది. హిందీలోకి డబ్ అవుతున్న అతడి తెలుగు సినిమాలకు అక్కడ అద్బుతమైన స్పందన వస్తోంది. రెండేళ్ల కిందట తెలుగులో యావరేజ్ గా ఆడిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాను హిందీలో అనువాదం చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే కోటి దాకా వ్యూస్ రావడం విశేషం.
తాజాగా ‘సరైనోడు’ సినిమాను కూడా యూట్యూబ్ లో పెట్టారు. ఈ పెట్టడం కూడా మామూలుగా కాదు. టీవీల్లో ప్రిమియర్ షోలు వేస్తుంటే ఎలాంటి హంగామా ఉంటుందో.. అలాగే సోషల్ మీడియాలో హడావుడి నడిచింది. మూడు రోజుల్లో.. రెండు రోజుల్లో అని కౌంట్ డౌన్ నడిపించి.. మంచి హైప్ తీసుకొచ్చి మరీ యూట్యూబ్ లో ‘సరైనోడు’ హిందీ వెర్షన్ రిలీజ్ చేశారు. అది రెండు రోజుల వ్యవధిలో 12 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం విశేషం.
ఓ తెలుగు డబ్బింగ్ సినిమాకు హిందీలో ఈ స్థాయిలో ఆదరణ అన్నది ఊహకందని విషయం. దీనికి లైక్స్ కూడా లక్షల్లో వస్తున్నాయి. మరోవైపు మొన్న ఆదివారం నాడు సోనీ మ్యాక్స్ ఛానెల్.. ‘సరైనోడు’ హిందీ వెర్షన్‌ను ప్రిమియర్ షోగా ప్రసారం చేసింది. దానికి కూడా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ వచ్చినట్లు సమాచారం. హిందీ వెర్షన్‌ను సైతం ‘సరైనోడు’ అనే పేరుతోనే ప్రసారం చేయడం విశేషం. ఈ ఊపు చూసే బన్నీ కొత్త సినిమా ‘దువ్వాడ జగన్నాథం’ హిందీ డిజిటల్, శాటిలైట్ హక్కుల్ని రూ.7 కోట్లకు కొన్నట్లు సమాచారం.
Recent Random Post: