
కోలీవుడ్ ప్రముఖ హీరో అజిత్ షూటింగ్లో గాయపడ్డారు. ఆయన క్షేమంగా ఉన్నప్పటికీ.. గాయాల తీవ్రత ఎంతన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. యూరప్ లో జరుగుతున్న షూటింగ్ లో ఆయన గాయపడినట్లుగా తెలుస్తోంది.
అజిత్ ప్రస్తుతం వివేగం అనే తమిళ మూవీని చేస్తున్నారు.
ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం యూరప్‌లో ఈసినిమా షూటింగ్ సాగుతోంది. షూట్‌లో భాగంగా కొంత ఎత్తు నుంచి కిందకు దూకాల్సి ఉంది. ఈ రిస్కీ ఫైట్ సీన్ ను తానే స్వయంగా చేసేందుకు అజిత్ సిద్ధమయ్యారు.
ఎత్తు నుంచి కిందకు దూకిన సీన్లో అజిత్ భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో.. షూటింగ్‌ను నిలిపి వేసి..హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు.. శస్త్రచికిత్స అవసరమా? లేదా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
తమ అభిమాన కథానాయకుడు షూటింగ్‌లో గాయపడటంపై అజిత్ అభిమానులు కలవరం చెందుతున్నారు. ప్రమాదం జరిగినప్పటికీ.. గాయం తీవ్రత ఎక్కువ కాదన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్‌ను క్యాన్సిల్ చేశారు.
Recent Random Post: