జన్మకో జగన్ అంటున్న వినాయక్

టాలీవుడ్ టాప్ డైరక్టర్ జగన్ ను తెగపొగిడేస్తున్నారు. బ్రతికితే అతడిలా బతకాలంటున్నారు. మనకు తెలిసినంతవరకూ వినాయక్ జగన్ ను కలవలేదు. వైసీపీతో ఎలాంటి అనుబంధం లేదు. మరి అలాంటప్పుడు జగన్ ఎందుకు పొగుడుతున్నారు అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్.

మెగాస్టార్ 150వ మూవీ ఖైదీ నంబర్ 150తో బిజీగా ఉన్న వినాయక్.. మెగా హిట్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు. రిలీజ్ కు రెడీ అయిన ఈ మూవీ గురించి ఇంటర్వ్యూలు ఇస్తున్న వినాయక్.. తన మనసులో మాట బయటపెట్టారు. తనకు రాజమౌళి, పూరీ జగన్నాథ్ అలియాస్ జగన్ అంటే ఇష్టమంటున్నారు.

తాము ముగ్గురం కలిస్తే పండగే అంటున్న వినాయక్.. రాజమౌలి తనను చూడగానే ఉత్సాహంగా ఆహ్వానిస్తారని గుర్తుచేసుకున్నారు. హే వినయ్ వచ్చాడని చాలా హ్యాపీగా ఫీలౌతారన్నారు. బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కూడా రాజమౌళితో కొంచెం కూడా మార్పు లేదని వినాయక్ ప్రశంసల జల్లు కురిపించారు.

అటు మరో ఫ్రెండ్ పూరీ జగన్నాథ్ ను ఆకాశానికెత్తేశారు. తనకు మూడౌట్ అయినప్పుడల్లా జగన్ ను తలుచుకుంటానంటున్నారు వినాయక్. ఎప్పుడూ కోపం, ఆవేదన లేకుండా బిందాస్ గా ఉంటారని పూరీ జగన్నాథ్ చెబుతున్నారు. పుడితే జగన్ లా పుట్టాలంటున్నారు వినాయక్.


Recent Random Post: