
నటుడిగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు కూడా చివరికి హీరో అవ్వాలనే ఆశిస్తారు. ఇక టెక్నీషియన్‌గా ఉన్న వాళ్లందరి గమ్యం దర్శకత్వం అవుతుంది. అలాగే ప్రొడక్షన్ వ్యవహారాల్లో చేయి పెట్టిన వాళ్లందరూ అంతిమంగా నిర్మాత కావాలనుకుంటారు. ఈ కోవలోనే పీఆర్వోలు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. సీనియర్ పీఆర్వో బి.ఎ.రాజు ఇప్పటికే నిర్మాతగా తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు.
ఇప్పుడు మరో పీఆర్వో నిర్మాత అవతారం ఎత్తేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ప్రతి సినిమాకూ పీఆర్వోగా వ్యవహరిస్తూ.. నందమూరి ఫ్యామిలీకి చాలా సన్నిహితుడిగా పేరు పడ్డ మహేష్ కోనేరు నిర్మాగా మారుతున్నాడు. మహేష్ కొన్నాళ్ల కిందటే నిర్మాణంలోకి రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్సన్స్’ పేరుతో బేనర్ కూడా అనౌన్స్ చేశాడు మహేష్. ఇప్పుడు ఈ సంస్థపై నిర్మించబోయే తొలి సినిమా ఏదో కూడా వెల్లడించాడు. అతను కళ్యాణ్ రామ్‌తోనే తన తొలి సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
ఆ మధ్య ‘180’ ఫేమ్ జయేంద్ర దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్నే మహేష్ నిర్మించబోతున్నాడు. బుధవారం కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు నేపథ్యంలో విషెస్ చెబుతూ ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది. ఈ చిత్రానికి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం అందించబోతుండటం విశేషం. ప్రముఖ తమిళ రైటర్ డ్యూ సుబా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. ‘180’ మ్యూజిక్ డైరెక్టర్ శరత్ సంగీతాన్నందిస్తాడు.
Recent Random Post: